ఒకే రోజు.. ఒకే హీరో.. రెండు సినిమాలు

Update: 2021-12-28 00:30 GMT
యంగ్ హీరో నాగ శౌర్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది హీరోలు కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయారు. కాని నాగ శౌర్య మాత్రం తక్కువ గ్యాప్‌ లోనే తన వరుడు కావలెను మరియు లక్ష్య సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రెండు సినిమాల్లో కూడా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన నాగ శౌర్య రెండు సినిమాలతో కూడా ఆకట్టుకున్నాడు. వరుడు కావలెను సినిమా కమర్షియల్‌ గా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ శౌర్య మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రాబోతున్నాడు. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో నాగ శౌర్య వర్సెస్‌ నాగ శౌర్య అన్నట్లుగా ఫైటింగ్‌ జరుగబోతుంది.

జనవరి 7వ తారీకున ఓటీటీ లో నాగ శౌర్య నటించిన వరుడు కావలెను మరియు లక్ష్య సినిమా లు విడుదల కాబోతున్నాయి. రెండు సినిమా లు కూడా ఒకే సారి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన సినిమా కు ఆయన సినిమానే పోటీ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటీటీ లో అయినా కూడా పోటీ లేకుండా జాగ్రత్త పడుతూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు నాగ శౌర్య సినిమా లు మాత్రం అనుకోకుండా రెండు ఒకే సారి స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యాయి. ఈ రెండు సినిమా లు థియేటర్లలో కంటే కూడా ఖచ్చితంగా ఓటీటీ లో ఎక్కువ సక్సెస్ ను దక్కించుకుంటాయనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

వరుడు కావలెను సినిమా ను జీ 5 ఓటీటీ వారు జనవరి 7 న స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆహా వారు భారీ మొత్తానికి లక్ష్య ను దక్కించుకుని అదే జనవరి 7వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమా లు వేరు వేరు ఓటీటీ ల్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న నేపథ్యంలో నాగ శౌర్య అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అదే రోజున ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా థియేటర్‌ రిలీజ్ ఉన్న విషయం తెల్సిందే. అయినా కూడా ఈ రెండు సినిమా లకు ఓటీటీ లో ఖచ్చింగా మంచి స్పందన వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయిన రోజే కాకుండా ఆ తర్వాత తర్వాత కూడా ట్రెండ్‌ అయ్యి మంచి విజయాన్ని సాధించిన దాఖలాలు ఉన్నాయి. కనుక ఈ రెండు సినిమా లకు ఓటీటీ లో మంచి రెస్పాన్స్‌ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News