ప్రియురాలిని ట్రోల్‌ చేస్తే ఊరుకోనంటున్న హీరో

Update: 2019-04-10 16:20 GMT
బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ దావన్‌ చాలా కాలంగా నటాషా దలాల్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కూడా సహజీవనంలో కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. హీరోగా మరిన్ని సక్సెస్‌ లు వచ్చాక పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వరుణ్‌ దావన్‌ తాజాగా తన ప్రియురాలు నటాషా గురించి కొందరు చేస్తున్న సోషల్‌ ట్రోల్స్‌ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నటాషా గతం గురించి - ఆమె వరుణ్‌ దావన్‌ తో ప్రేమ గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున బ్యాడ్‌ కామెంట్స్‌ వస్తూ ఉంటాయి. ఆ కామెంట్స్‌ కొన్ని సార్లు శృతి మించడం కూడా జరుగుతుంది. ఆ కామెంట్స్‌ పై తాజాగా అర్భాజ్‌ ఖాన్‌ టాక్‌ షోలో స్పందిస్తూ.. నటాషాపై ట్రోల్స్‌ వచ్చినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఆ సమయంలో వారిని నిలదీయ్యాలనిపిస్తుంది. నటాషా నాకు సంబంధించిన వ్యక్తి - అలాంటప్పుడు ఆమెకు రెస్ పెక్ట్‌ ఇవ్వాలని కోరుకుంటాను - ప్రతి ఒక్కరు కూడా ఆమె పట్ల గౌరవంతో ఉండాలని ఆశ పడతారు. ఆమెతో నేను చాలా కాలంగా రిలేషన్‌ షిప్‌ లో ఉన్న విషయం అందరికి తెల్సిందే. అయినా కూడా ఆమెను ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె ఎవరో తెలియక ముందు ట్రోల్‌ చేస్తే సరే అనుకుంటాం - కాని ఆమె నా లవర్‌ అని తెలిసిన తర్వాత కూడా ట్రోల్‌ చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ వరుణ్‌ దావన్‌ ప్రశ్నించాడు. ఎవరైతే నటాషా గురించి బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తున్నారో - వారి వాళ్లపై బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తూ వాళ్లు ఊరుకుంటారా - బ్యాడ్‌ కామెంట్స్‌ అనేవి బాధ పెడతాయని మీకు తెలియదా అంటూ వరుణ్‌ తన ప్రియురాలిని ట్రోల్‌ చేసిన వారిని ఏకిపారేశాడు. మరి ఇప్పటికైనా నటాషాపై కామెంట్స్‌ తగ్గుతాయో చూడాలి.
Tags:    

Similar News