పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ''హరి హర వీరమల్లు''. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వీరమల్లు ఓ దొంగ అనే క్లారిటీ కూడా వచ్చేసింది. 17వ శతాబ్దం కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో వీరమల్లు కోహినూర్ వజ్రం దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటాడని.. ఈ మూవీలో పవన్ తో పాటు హీరోయిన్ కూడా ఓ దొంగే అని టాక్ నడుస్తోంది.
'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ కూడా ఓ దొంగ గా కనిపిస్తుందట. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో పవన్ తో పోరాటానికి దిగుతుందట. పవన్ - నిధి మధ్య సన్నివేశాలు క్రిష్ వినోదాత్మకంగా రాసుకున్నాడట. ఇక శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరిగా.. హీరోను చూసిన వెంటనే ప్రేమలో పడే పాత్రలో ఆమె కనిపించనుందట. ఇకపోతే ఈ చిత్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చార్మినార్ మరియు మొగలాయుల కాలం నాటి దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇది పవన్ కెరీర్ లో ఫస్ట్ పీరియాడికల్ మూవీ మరియ ఆయన కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని చెప్పవచ్చు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ జులై నాటికి పూర్తవుతుంది. ''హరి హర వీరమల్లు'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.