మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న గని(వీటీ10) బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా కేటగిరీలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత యూనిట్ తిరిగి చిత్రీకరణను ప్రారంభించనుంది.
తాజా సమాచారం మేరకు.. వరుణ్ తేజ్ త్వరలో డైరెక్టర్ వెంకి కుడుములతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందని తెలిసింది. వెంకీ ఇప్పటికే ఛలో- భీష్మ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. తదుపరి అగ్ర హీరోలతో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే అతడు వరుణ్ తేజ్ కు ఒక కథను వినిపించారట. అతను దానిని ఇష్టపడ్డాడు. ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైతే ఇక సెట్స్ కెళ్లడమే ఆలస్యం అని తెలుస్తోంది. 2013లో రామ్ చరణ్ నటించిన తుఫాన్ చిత్రానికి అడిషనల్ రైటర్ గా కొనసాగిన వెంకీ కుడుముల పదేళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ శిష్యుడిగా అతడి కామిక్ సెన్స్.. రొమాంటిక్ లవ్ సీన్స్ మేకింగ్ యువతరానికి కనెక్టవుతున్నాయి. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో ప్రేమకథలతో మెప్పించగల సమర్థుడని ప్రూవ్ చేశాడు. వరుణ్ తేజ్ తో ఏ తరహా సినిమా తీస్తారు? అన్నది వేచి చూడాలి.