రణ్ వీర్ న్యూడ్ షూట్ పై విద్యాబాలన్ సంచలనం.. మమ్మల్ని చూడనివ్వండి!

Update: 2022-07-29 06:34 GMT
రోటీన్ కు భిన్నంగా చేస్తే చాలు.. అదో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. నటీనటులు.. సెలబ్రిటీలు.. ఎవరైనా సరే పాపులార్టీ రావాలంటే.. మిగిలిన వారు నడిచే మార్గాన్ని విడిచిపెట్టేసి.. ఇప్పటివరకున్న బంధనాల్ని తెంచేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనం.. బాలీవుడ్ హీరో రణ్ వీర్ చేసిన న్యూడ్ ఫోటో షూట్. ఇప్పుడిదో సంచలనంగా మారింది.

దీనిపై వాదోపవాదాలు ఓపక్క సాగుతుంటే.. మరోపక్క ఈ అంశాన్ని కావాల్సినంత వివాదాస్పదం చేసేశారు. మరికొందరు అడుగు ముందుకేసి కంప్లైంట్లు ఇస్తూ కేసులు బుక్ చేస్తున్నారు. ఇలాంటి వేళ.. రణ్ వీర్ చేసింది తప్పా? ఒప్పా? అనే దానిపై ఇప్పటికే ప్రముఖులు ఒక్కొక్కరుగా సమర్థిస్తున్నారు.

వీరి సమర్థనలు ఎలా ఉన్నా... బాలీవుడ్ సీనియర్ నటి.. తనదైన శైలిలో పాత్రల్ని పోషించేందుకు ఎంతటి రిస్కుకైనా ఓకే చెప్పే విద్యాబాలన్..తాజా ఉదంతంపై చేసిన వ్యాఖ్య మరింత సంచలనంగా మారింది.

రణ్ బీర్ న్యూడ్ షూట్ గురించి ఆమెను ప్రశ్నించినప్పుడు.. అందుకు బదులిస్తూ.. ‘అరే.. ఎందుకంత ప్రాబ్లం? మొదటిసారి ఒక వ్యక్తి అలా చేశాడు.

మమ్మల్నికూడా చూడనివ్వండి’ అంటూ బోల్డ్ గా వ్యాఖ్యలు చేశారు. కాకుంటే.. దాన్ని సీరియస్ గా కాకుండా.. సరదాగా చెప్పినట్లుగా చెప్పేశారు. ఈ వ్యవహారాన్ని వివాదంగా మారిన వైనంపై స్పందిస్తూ.. వారికి పెద్దగా పని లేకపోయి ఉండొచ్చు..అందుకే అలా చేసి ఉండొచ్చు. పేపర్లో ఆ ఫోటో నచ్చకపోతే.. పేపర్ మూసేయండి. పక్కన పడేయండి. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి.. కేసుల వరకు అవసరం లేదు’ అంటూ తేల్చేశారు. రణ్ వీర్ ఫోటో షూట్ సంగతేమోకానీ.. విద్యాబాలన్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
Tags:    

Similar News