ఆ జాబితాలో రౌడీ హీరోకు మూడో స్థానం

Update: 2020-08-22 18:12 GMT
`అర్జున్ రెడ్డి`వంటి కల్ట్ క్లాసిక్ తో టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన విజ‌య్ దేవరకొండకు యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ లోకి `అర్జున్ రెడ్డి`తో కల్ట్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఓవ‌ర్ నైట్ స్టార్ గా  మారాడు. అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ మూవీలో భగ్న ప్రేమికుడిగా న‌టించిన విజ‌య్ దేవరకొండ....`గీత గోవిందం` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో గోవింద్ వంటి సాఫ్ట్ క్యారెక్ట‌ర్ లో ఒదిగిపోయి మెప్పించాడు. ఆ తర్వాత ట్యాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలతో యూత్ లో ఈ రౌడీ హీరోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇన్‌స్టా‌గ్రమ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న తొలి దక్షిణాది హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ తాజాగా జాతీయ స్థాయలోనూ తనకు క్రేజ్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా టైమ్స్ సంస్థ విడుదల చేసిన `ఇండియాస్ టాప్ 50 మోస్ట్ డిజైరబుల్‌మెన్ లిస్ట్ - 2019` ‌లో విజయ్ దేవరకొండ మూడో స్థానం దక్కించుకున్నాడు.

ఈ జాబితాలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మొదటి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో మరో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నిలిచాడు. మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ దేవరకొండ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్‌మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం విశేషం.

 ఇక, `URI` సినిమాలో లీడ్ రోల్ పోషించిన విక్కీ కౌశల్ నాలుగో స్థానం దక్కించుకోగా....టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ జాబితాలో ఆరో స్థానం దక్కించుకోగా....మెగాస్టార్ తనయుడు రాం చరణ్ 18వ స్థానంలో నిలిచాడు. ఆన్ లైన్ పోల్ ద్వారా వచ్చిన ఓట్ల సాయంతో ఈ జాబితాను టైమ్స్ సంస్థ రూపొందించింది. 
Tags:    

Similar News