వరుసగా రౌడీ రెండవ సారి నెం.1

Update: 2020-03-18 05:45 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండకు యూత్‌ లో అత్యధికంగా క్రేజ్‌ ఉందంటూ మరోసారి నిరూపితం అయ్యింది. 2018 ఏడాదికి గాను హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ గా విజయ్‌ దేవరకొండను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆన్‌ లైన్‌ ద్వారా మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ గా ప్రేక్షకులు విజయ్‌ దేవరకొండను ఎన్నుకున్నారు. మరోసారి విజయ్‌ దేవరకొండ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ గా నిలిచాడు. 2019 సంవత్సరం కు గాను మరోసారి విజయ్‌ దేవరకొండ నెం.1 స్థానంలో నిలిచాడు.

2018 సంవత్సరంలో అర్జున్‌ రెడ్డి.. గీత గోవిందం చిత్రాల వల్ల మోస్ట్‌ డిజైరబుల్‌ గా నిలిచి ఉంటాడు. కాని ఈసారి ఆయనకు ఛాన్స్‌ లేదని కొందరు భావించారు. వరుసగా ఫ్లాప్స్‌ వస్తున్న నేపథ్యంలో రౌడీ స్టార్‌ క్రేజ్‌ తగ్గుతోందని.. స్టార్‌ డం పడిపోతుందని కొందరు కామెంట్స్‌ చేశారు. కాని ఆ కామెంట్స్‌ అన్నింటికి కూడా మళ్లీ నెం.1 గా మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ గా నిలవడంతో రౌడీ స్టార్‌ సమాధానం ఇచ్చినట్లయ్యింది.

ఈ జాబితాలో రెండవ స్థానంలో రామ్‌ చరణ్‌ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో రామ్‌ పోతినేని మరియు ప్రభాస్‌ ఉన్నారు. ప్రభాస్‌ కు నాల్గవ స్థానం దక్కడం ఆశ్చర్యంగా ఉంది. 2018 సంవత్సరంకు గాను నెం.2గా ప్రభాస్‌ నిలిచాడు. ఈసారి రెండు స్థానాలు కోల్పోయి 4వ స్థానంలో నిలిచాడు. టాప్‌ 10 లో మెగా యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.. సుధీర్‌ బాబు.. యాంకర్‌ ప్రదీప్‌ లు నిలవడం చెప్పుకోదగ్గ విషయం.


Tags:    

Similar News