తమిళ హీరోలు తెలుగులో హిట్స్ సాధించడం ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకోవడం సాధారణంగా జరిగేదే. ఇది రజనీ.. కమల్ హాసన్ జమానా నుండి సాగుతోంది. ఈ జెనరేషన్ తమిళ స్టార్స్ కొందరికి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. కానీ ఎందుకో 'దళపతి' విజయ్ కి మాత్రం ఇక్కడ పెద్దగా మార్కెట్ రాలేదు. విజయ్ సూపర్ డూపర్ హిట్స్ అన్నీ తెలుగులో వేరే స్టార్ హీరోలు రీమేక్ చేయడం దానికొక కారణం. అందుకే ఈ మధ్య తన చిత్రాల తెలుగు రీమేక్ రైట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడట.
విజయ్ తాజా చిత్రం 'సర్కార్' నవంబర్ 6 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొదట్లో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా మన తెలుగు నిర్మాతలు కొందరు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఎంతో ప్రయత్నించారట. మురుగదాస్ తో మాట్లాడి తెలుగు వెర్షన్ రిలీజ్ ను ఆపించే ప్రయత్నాలు చేశారట. కానీ విజయ్ మాత్రం 'సర్కార్' నిర్మాతలకు - దర్శకుడికి తెలుగు రీమేక్ రైట్స్ అమ్మవద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడట. అంతే కాకుండా తమిళ వెర్షన్ తో పాటే తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేయమని చెప్పాడట.
విజయ్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో యావరేజ్ అనిపించుకున్నాయి గానీ ఒక్కటి కూడా సూపర్ హిట్ కాలేదు. దీంతో 'సర్కార్' తో అయినా సూపర్ హిట్ కొట్టాలని.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించాలని పట్టుదలగా ఉన్నాడట. మరి ఈ దళపతి ఆ మురుగదాస్ లు కలిసి ఎలాంటి 'సర్కార్' ను తెలుగువారి ముందుకు తీసుకొస్తారో వేచి చూడాలి.