అదరిందమ్మా.. బాగానే అమ్మేశారు

Update: 2017-10-17 10:34 GMT
ఆ మధ్యన 'తెరి' అనే సినిమాతో హీరో విజయ్ కు ఒక మంచి హిట్ నే ఇచ్చాడు దర్శకుడు అట్లీ. అప్పట్లో 'రాజా రాణి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ శంకర్ శిష్యుడు.. ఇప్పుడు మరోసారి విజయ్ నే డైరక్ట్ చేస్తున్నాడు. 'మెర్సాల్' అనే సినిమాతో రేపు వచ్చేస్తున్నాడు. ఈ తమిళ సినిమాను తెలుగులో 'అదిరింది' అంటూ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

విషయం ఏంటంటే.. అసలు మెర్సాల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే వావ్ అనిపించకమానదు. నిజానికి తమిళంలో తెలుగుకంటే మార్కెట్ చాలా చిన్నది. అయినా సరే 'మెర్సాల్' సినిమా మాత్రం ఏకంగా 155+ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడులోనే 70 కోట్లకు ధియేట్రికల్ రైట్స్ అమ్మేస్తే.. తెలుగు రైట్లు షుమారు 5 కోట్ల వరకు పలికాయి. ఈ రెండు వర్షన్ల తాలూకు రిలీజ్ మలయాళంలో కన్నడంలో కలుపుకుని 12 కోట్లు బిజినెస్ అయ్యింది. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాను ఏకంగా 26 కోట్లకు అమ్మేశారు. మొత్తంగా చూసుకుంటే ధియేట్రికల్ రైట్స్ ను 112+ కోట్లకు పైనే అమ్మేశారు. ఇకపోతే శాటిలైట్ మ్యూజిక్ డిజిటిల్ వగైరా రైట్స్ అన్నీ కలుపుకుని మరో 45 కోట్లు వచ్చిందట.

ఈ శాటిలైట్ రైట్స్ తాలూకు వసూళ్ళను తీసేస్తే కూడా.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ బాషల్లో కలుపుకుని ఈ సినిమా ఏకంగా 200 కోట్లు గ్రాస్ వసూలు చేస్తేనే పంపిణీదారులు సేవ్ అవుతారు. మొన్న వచ్చిన ఫ్లాప్ సినిమా వివేగం ఫ్లాప్ అయినా కూడా వసూలు చేసింది కాబట్టి.. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా అదే ధీమా వ్యక్తపరుస్తున్నారు.


Tags:    

Similar News