విజ‌యేంద్రుడి టీజింగ్! మ‌హేష్ నే ఎందుకు ఎంపిక చేశామంటే!?

Update: 2022-12-04 06:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి తెర‌కెక్కించ‌నున్న ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ కోసం మ‌హేష్ నే ఎందుకు ఎంపిక చేయాలి?  ఎన్టీఆర్ .. ప్ర‌భాస్ లేదా రామ్ చర‌ణ్.. బ‌న్నీల‌లో ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేయొచ్చు క‌దా? ఇంకా చాలా మంది ప్ర‌తిభావంతులైన హీరోలు అందుబాటులో ఉన్నారు. వారిని ఎంపిక చేయొచ్చు క‌దా? ఇలాంటి సందేహం ఎవ‌రికైనా క‌లిగితే దానికి స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇచ్చిన ఇంటెన్స్ ఆన్సర్ ఏంటో తెలుసుకుని తీరాలి.  

బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ తో మ‌రోసారి స‌త్తా చాటిన‌ SS రాజమౌళి త‌దుప‌రి టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ తో భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే వేసవిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రపంచ దేశాలలో అరుదైన అట‌వీ లొకేష‌న్ల‌లో ఈ సినిమాని చిత్రీక‌రించేందుకు కేష‌న్ల వేట సాగిస్తున్నారు.

కానీ ఈ ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కి మహేష్ బాబు ఎందుకు ఉత్తమ ఎంపిక అవుతాడు? అనే సందేహం మీడియా వ్య‌క్తం చేసింది. దానికి విజ‌యేంద్రుడు ప్ర‌తిస్పందించారు. ప్ర‌భాస్ - తార‌క్-చ‌ర‌ణ్ ల‌తో సినిమాలు చేసిన ద‌ర్శ‌క‌ధీరుడు SS రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయాల‌ని అనుకున్నారు. మ‌హేష్ న‌టించే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ గా ఉండాల‌ని అత‌డు భావించారు. వెంట‌నే త‌న ఆలోచ‌న‌ను విజ‌యేంద్ర ప్ర‌సాద్ తో కూడా పంచుకున్నారు. మ‌హేష్‌ ఎంపిక అలా పూర్త‌యింది.

అయితే మ‌హేష్ నే ఎంపిక చేసుకోవ‌డం వెన‌క లాజిక్ ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తాజాగా రివీల్ చేసారు. ``మహేష్ బాబు చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. అత‌డు న‌టించిన‌ యాక్షన్ సన్నివేశాలను చూస్తే చాలా ఎమోష‌న‌ల్‌ గా ఉంటాడు. అది ఏ రచయితకైనా చాలా అవ‌స‌ర‌మైన మంచి విషయం`` అని అన్నారు. మహేష్ బాబు- SS రాజమౌళి తదుపరి సినిమా నుండి ఏమి ఆశించవచ్చు? అన్న దానికి ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. ``ఒక రచయితకు హీరో పాత్ర నుండి ఇంటెన్స్ సంఘ‌ర్ష‌ణ‌ను  తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టదు. మ‌హేష్ ఎలాంటి స‌న్నివేశంలో అయినా ఏ సమయంలోనైనా సులభంగా త‌న‌ను తాను మ‌లుచుకోగ‌ల‌డు. ఇది ప్రతి ఒక్కరి పనిని సులభతరం చేస్తుంది`` అని అన్నారు.

అడ‌విలో సాహ‌స‌విన్యాసాల‌తో (ఫారెస్ట్ అడ్వెంచ‌ర్) ఒక చ‌క్క‌ని మూవీ చేయాలని చాలా కాలంగా రాజ‌మౌళి అనుకుంటున్నాడు. కానీ అతనికి ఇంత‌కాలం ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి అడ్వెంచ‌ర‌స్ సినిమాల‌కు మహేష్ ఉత్తమ ఎంపికగా భావించామ‌ని విజయేంద్రుడు అన్నారు. మ‌హేష్ కోస‌మే ఈ క‌థ‌ను రాయడం ప్రారంభించామ‌ని తెలిపారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో చిత్రీకరించడానికి ఇప్ప‌టికే టీమ్ ప్లాన్ చేస్తోంది. ``సాహసం అనేది అనేక దేశాలకు హీరో పాత్రను తీసుకెళుతుంది`` అని విజయేంద్రుడు క‌థ‌పై చిన్న హింట్ కూడా ఇచ్చారు. షూట్ షెడ్యూల్ గురించి ప్ర‌శ్నించ‌గా.. ``మేం వచ్చే ఏడాది మే-జూన్ నాటికి దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అని సమాధానమిచ్చారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ విజయేంద్ర ప్రసాద్ నుండి అద్భుతంగా ఏమీ ఆశించదని ఆయ‌న స్వ‌యంగా అన్నారు. ఒక దృశ్యం (స‌న్నివేశం లేదా సినిమా) కోసం నా ద‌గ్గ‌ర‌కు వస్తారు. కానీ నేను ఎప్పుడో చిన్న కథలు రాసేవాడిని.. కానీ అవి ఇప్పుడు స్తబ్దుగా ఉన్నాయి.. వాటిని ఎవరూ ట‌చ్ చేయ‌లేరు.. అని కూడా వ్యాఖ్యానించారు.

చిన్న కథలకు చాలా మంది రచయితలు ఉన్నారు.. మేం మీ నుండి ఒక దృశ్యం (సినిమా) కోరుకుంటున్నామని నిర్మాత‌లు త‌న‌ను కోరతార‌ని విజ‌యేంద్రుడు తెలిపారు. గోవాలో జరిగిన 53వ IFFIలో స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఫిల్మ్ మేకింగ్ ఔత్సాహిక విద్యార్థులకు మాస్టర్ క్లాస్ ఇచ్చారు. ఆయ‌న బాహుబ‌లి -బాహుబ‌లి 2- భ‌జ‌రంగి భాయిజాన్- మ‌ణిక‌ర్ణిక‌-త‌లైవి లాంటి సంచ‌ల‌న చిత్రాల‌కు క‌థ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలోనే అరుదైన పాన్ ఇండియా సినిమా క‌థ‌ల ర‌చ‌యిత గా గొప్ప‌ గౌరవాన్ని అందుకుంటున్నారు.
Tags:    

Similar News