విరించి వర్మ యాక్షన్ స్టోరీ చెబితే ఏమైంది?

Update: 2016-10-09 19:30 GMT
‘ఉయ్యాల జంపాల’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు విరించి వర్మ. ఐతే ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినా రెండో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. మరి ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటే.. తాను తయారు చేసిన ఒక కథ రిజెక్ట్ అయిందని చెప్పాడు విరించి. ‘ఉయ్యాల జంపాల’ లాంటి సెన్సిబుల్ మూవీ తర్వాత దానికి భిన్నంగా యాక్షన్ సినిమా చేద్దామని ప్రయత్నించానని.. కానీ తాను తయారు చేసిన కథకు ఎవరూ ఓకే చేయలేదన్నాడు.

‘‘ఉయ్యాల జంపాల తర్వాత మరింత మంచి కథతో వద్దామని గ్యాప్ తీసుకున్నా. తొలి సినిమాకు భిన్నంగా యాక్షన్ ప్రధానంగా నడిచే కథ రాసుకుని కొందరికి వినిపించాను. ఐతే దాన్ని తిరస్కరించారు. ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలు చేసే దర్శకులు చాలామంది ఉన్నారని.. ఉయ్యాల జంపాల తరహాలో భావోద్వేగాలతో కూడిన.. యువతకు సంబంధించిన కథతో రమ్మన్నారు. ఈ తరమాలోనే కొన్ని సినిమాలు చేశాక యాక్షన్ సినిమాలు చేయమన్నారు. దాంతో ఆ కథను పక్కనబెట్టి ‘మజ్ను’ స్టోరీ రాశాను.

ఒకబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించబోతూ.. అంతకుముందు ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటే ఆమెను మిస్ చేసుకున్నానన్న నిజం తెలుసుకుంటే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. ప్రేమ ఇద్దరిని కలుపుతుంది. కానీ బ్రేకప్ ఇద్దరిని ఎప్పటికీ విడదీయలేదు అనే పాయింట్ తో ఈ కథను మరింతగా విస్తరించాను. నానికి ఈ కథ చెప్పగానే నచ్చింది. ఐతే అప్పటికి వేరే సినిమాలు చేస్తుండటంతో ఆలస్యమైంది’’ అని విరించి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News