తమిళ్ సూపర్ విజయ్ నటించిన తాజా చిత్రం వారిసు తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా సాధిస్తూ ఉన్న వసూళ్లు విజయ్ యొక్క సత్తా చూపిస్తుంది. ఈ సినిమా లో ఒక నటి మిస్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
వారిసు సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్.. రష్మిక మందన్నా మరియు ఖుష్బు ల యొక్క ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సమయంలో వారిసు సినిమాలో ఖుష్బు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
తీరా సినిమా చూసిన తర్వాత ఖుష్బూ లేక పోవడం ఆశ్చర్యం ను కలిగిస్తుంది. తమిళ మీడియా సర్కిల్స్ లో ఖుష్బూ ను నటింపజేసిన పాత్రను ఆ తర్వాత జయసుధ తో రిప్లేస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై యూనిట్ వర్గాల నుండి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
కుటుంబ పెద్ద పాత్రలో ఖుష్బూ కంటే కూడా జయసుధ అయితేనే బాగుందని.. ఒక వేళ ఖుష్బూ నే ఉండి ఉంటే ఖచ్చితంగా ఆమె నిరాశ పర్చేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఖుష్బూ ఈ సినిమా షూటింగ్ సమయంలో సందడి చేసి ఇప్పుడు లేకపోవడం ఒకింత చర్చకు తెర తీసినట్లు అయ్యింది. తమిళ సినీ ప్రేక్షకులు ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.