సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలని ఏ దర్శకుడైనా కోరుకుంటారు. తెలుగు దర్శకులే కాదు పేరు మోసిన తమిళ దర్శకులు కూడా మహేష్ సినిమా చెయ్యాలని ఆరాటపడుతుంటారు. అయితే అవకాశం మాత్రం కొందరికే లభిస్తుంది. అయితే మహేష్ మొదటిసారి ఒక దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ఏం చూస్తారనేది తెలియదు కానీ రెండో అవకాశం ఇవ్వాలంటే మాత్రం తనకు హిట్ ఇచ్చి ఉండాలి అనే టాక్ ఉంది.
'అతడు' ఇచ్చారని త్రివిక్రమ్ కు 'ఖలేజా'.. 'పోకిరి' ఇచ్చారని పూరికి 'బిజినెస్ మేన్'.. 'దూకుడు' ఇచ్చారని శ్రీను వైట్లకు 'ఆగడు'.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇచ్చారని చంటి అడ్డాలకు 'బ్రహ్మోత్సవం'.. 'శ్రీమంతుడు' ఇచ్చారని కొరటాల శివకు 'భరత్ అనే నేను'... ఇలా చాలామంది డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అదే మహేష్ కు ఎవరైనా డైరెక్టర్ ఒక ఫ్లాప్ ఇస్తే మాత్రం ఆ తర్వాత ఆ డైరెక్టర్ తో మరోసారి పని చెయ్యలేదు. ఇందులో మనం తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఫ్లాపులు ఇస్తూ జనాలను బెదరగొట్టే వారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడం అనేది మహేష్ డ్యూటీ ఏమీ కాదు కదా? ఇదంతా కోట్లతో ముడిపడిన వ్యవహారం.. పెట్టుబడి తిరిగి తీసుకురాగలరు అనే నమ్మకం ఉంటేనే అవకాశం ఇస్తారు. ఇందులో ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు.
సరిగ్గా ఈ టాపిక్ పైనే రీసెంట్ గా అనిల్ రావిపూడికి ఒక ప్రశ్న ఎదురైంది. హిట్ కొట్టిన డైరెక్టర్లకు మహేష్ మళ్లీ అవకాశం ఇస్తారు .. మరి మీకు ఛాన్స్ ఉందా అని అడిగితే జవాబు చెప్పేందుకు అని చాలా ఇబ్బంది పడ్డారు. 'సరిలేరు నీకెవ్వరు' హిట్ అని మొదటి రోజు నుంచే మేకర్స్ చెప్తున్నారు. నిజంగా హిట్ అయితే మాత్రం అనిల్ రావిపూడికి సెకండ్ ఛాన్స్ ఉన్నట్టే. మరి ఎందుకు ఆ ప్రశ్నకు అనిల్ సమాధానం ఇవ్వలేదనేది అలోచించాల్సిన విషయం. ఈ సినిమా రియల్ స్టామినా శెలవులు పూర్తయిపోతాయి కాబట్టి సోమవారం నాడే తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ కాని పక్షంలో అనిల్ కు సెకండ్ ఛాన్స్ లేనట్టేనని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.