మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన'. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాను దగ్గరుండి పర్యవేక్షించాడని తెలుస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల లేట్ అవుతూ వచ్చింది. దీంతో 'ఉప్పెన' విడుదలవక ముందే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఈ సినిమాకు 'కొండపొలం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే 'ఉప్పెన' కంటే ముందే క్రిష్ సినిమా విడుదలవుతుంది అనే కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వైష్ణవ్ తేజ్ నటించిన ఫస్ట్ సినిమా కంటే ముందు రెండో సినిమా విడుదలకు సిద్ధమవుతోందట. 'ఉప్పెన' సినిమాను ఎంత లేట్ అయినా థియేటర్లలోనే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. కాకపోతే ఎప్పుడు అనేదానిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు క్రిష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు వచ్చేశాయి. పైగా 'ఉప్పెన' కంటే కథ పరంగా క్రేజ్ పరంగా క్రిష్ - వైష్ణవ్ సినిమాకే వెయిటేజ్ ఎక్కవ అనే అభిప్రాయం సినీ జనాల్లో వ్యక్తమవుతోంది. దీంతో 'ఉప్పెన' కంటే ముందు క్రిష్ సినిమా థియేటర్స్ లో వస్తుందనే పుకార్లు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో షికార్లు చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మరియు సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే.