`కేజీఎఫ్` ప్రాంచైజీ హిట్ తో కన్నడ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఊహించని సక్సెస్ యశ్ ని పాన్ ఇండియాలో నిలబెట్టలింది. ఇప్పుడు నటుడిగా ఆయన బాధ్యత ఇంకా పెరిగింది. పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకోవాల్సిన బరువైన బాధ్యత ఉంది. యశ్ తో సినిమా అంటే వందల కోట్లు వెచ్చించాలి. బ్లాక్ బస్టర్ అయితే అదే రేంజ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది.
ఇలా ఇన్ని లెక్కలు వేసుకుని రాకింగ్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ కమిట్ అవ్వాల్సి ఉంది. అందుకే యశ్ ఇప్పుడు ఏ మాత్రం తొందరపడలేని అతని రిలాక్స్ మోడ్ ని బట్టి అర్ధమవుతుంది. ఇప్పటివరకూ కొత్త సినిమా కమిట్ అవ్వలేదు. సబ్జెక్ట్..మేకర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా ముందుకెళ్లాలి? మరోవైపు టాలీవుడ్ నుంచి గట్టి పోటీని ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నో ఆలోచనలు యశ్ బుర్రని తొలిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యశ్ దర్శకుల విషయంలో బలమైన ఓ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తుంది. తదుపరి సినిమా చేస్తే తమిళ దర్శకుడితో చేయాలి? లేదా? తెలుగు డైరెక్టర్ తో పనిచేయాలని ఆలోచేన చేస్తున్నట్లు వినిపిస్తుంది. యశ్ థింకింగ్ బాగానే ఉంది. కన్నడ ఇండస్ర్టీ చాలా చిన్నది.
అక్కడన్ని పరిమిత బడ్జెట్ సినిమాలే. కేజీఎఫ్ హిట్ తోనే కన్నడ ఇండస్ర్టీకి పేరొచ్చింది. ఇప్పటి వరకూ అదే అక్కడ భారీ బడ్జెట్ చిత్రం.
ఆ హిట్ కొట్టగానే ప్రశాంత్ నీల్ తెలివిగా టాలీవుడ్ హీరోల్ని లాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడదే ఆలోచనతో యశ్ కూడా కనిపిస్తుంది. రాకింగ్ స్టార్ తెలుగుతో పాటు..తమిళ్ దర్శకుల వైపు చూస్తున్నట్లు సమాచారం. వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలుగా రెండు పరిశ్రమలకి మంచి పేరుంది. పాన్ ఇండియా కంటెంట్ ని రాయగల సత్తా ఉన్న మేకర్స్ ఉన్నారు.
ఎలాంటి కథనైనా కమర్శియల్ యాంగిల్ లో కి మార్చగల సత్తా రెండు పరిశ్రమల సొంతం. బడ్జెట్ పరంగానూ వందల కోట్లు వెచ్చించ గల నిర్మాణ సంస్థలున్నాయి. మరి యశ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ ఇండస్ర్టీ ముందుగా తీసుకుంటుందో చూద్దాం.