యువ హీరో సందీప్ కిషన్ సినిమాల్లో హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కి దూరమైన సందీప్.. అటు నిర్మాతగా ఇటు హీరోగా మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై తానే హీరోగా 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పార్టనర్ షిప్ కూడా ఉంది. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో డెన్నిస్ జీవన్ కనుకొలను రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు.
అలానే స్టార్ కమెడియన్ సత్య ని హీరోగా పరిచయం చేస్తూ 'వివాహ భోజనంబు' అనే సినిమా నిర్మించాడు సందీప్ కిషన్. దీనికి ఆనంది ఆర్ట్స్ మరియు సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ భాగస్వామ్యం కూడా ఉంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు సందీప్ తీస్తున్న ఈ రెండు సినిమాలకి థియేట్రికల్ బిజినెస్ డీల్స్ ఎలా వస్తున్నాయనే విషయం పక్కన పెడితే నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ మాత్రం బాగానే వస్తున్నాయని టాక్ నడుస్తోంది. 'ఏ1ఎక్స్ ప్రెస్' మరియు 'వివాహ భోజనంబు' సినిమాలకి కలిపి దాదాపుగా 8 కోట్లు పైనే ఆఫర్ వచ్చిందని సమాచారం. మరి ఈ రెండు సినిమాలతో యాంగ్ హీరో కంమ్ ప్రొడ్యూసర్ సందీప్ కిషన్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.