విక్కీ కౌశల్ మొన్నటి వరకు ఒక సాదారణ క్యారెక్టర్ ఆర్టిస్టు. కాని ఎప్పుడైతే ఈ నటుడు 'యూరి : ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంలో నటించాడో అప్పుడే స్టార్ అయ్యాడు. ఒక మామూలు సినిమాగా విడుదలైన యూరి చిత్రం సంచలన వసూళ్లను సాధిస్తూ ఎన్నో రికార్డులను బద్దలు చేస్తూంది. వారం వారంకు సినిమా కలెక్షన్స్ పెరిగి పోతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 250 కోట్లను వసూళ్లు చేసి 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. సాదారణంగా ఒక సినిమా రెండవ వారం తర్వాత పెద్దగా వసూళ్లను రాబట్టలేదు.
మొదటి రెండు వారాల్లో సాధించిన వసూళ్లకు కాస్త అటు ఇటుగానే ఫుల్ రన్ వసూళ్లు ఉంటాయి. ఈమద్య కాలంలో సినిమాల పరిస్థితి అంతా కూడా ఇంతే. కాని యూరి కలెక్షన్స్ మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయి. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కహో నా ప్యార్ హై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం మొదటి వారం కాస్త అటు ఇటుగానే ఆడింది. ఆ తర్వాత రెండవ వారం, మూడవ వారం, నాల్గవ వారం కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. వారాలు గడుస్తున్నా కొద్ది కలెక్షన్స్ పెరిగాయి.
అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన ఆ చిత్రం తర్వాత మళ్లీ ఏ సినిమా కూడా మూడవ, నాల్గవ వారం తర్వాత ఆ స్థాయి బాక్సాఫీస్ సందడి చేయలేదు. కాని ఇన్నాళ్లకు విక్కీ నటించిన యూరి చిత్రం అలాంటి అరుదైన రికార్డును దక్కించుకుంది. కేవలం ఇండియాలో ఈ చిత్రం 200 కోట్లకు పై చిలుకు వసూళ్లను రాబట్టింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. నిర్మాతలకు ఈ చిత్రం కాసుల పంట పండించడంతో పాటు విక్కీ కౌశల్ మరియు దర్శకుడికి ఒక్కసారిగా స్టార్ డం తీసుకు వచ్చింది. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి.