50 వయసులో మలైకా ఫిట్ టోన్డ్ బాడీ
తనదైన అందం, పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని ఎలివేట్ చేసేందుకు మలైకా అస్సలు భేషజానికి పోదు.;
వయసు కొందరికి ఒక నంబర్ మాత్రమే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది మలైకా అరోరా. 50 వయసులోను ఈ బ్యూటీ అరవిరిసిన అందాలను ఆరబోస్తూ హొయలొలికించే వీడియోలు, ఫోటోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో షికార్ చేస్తూనే ఉన్నాయి.
తనదైన అందం, పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని ఎలివేట్ చేసేందుకు మలైకా అస్సలు భేషజానికి పోదు. ఇప్పుడు మరోసారి తనలోని విలక్షణమైన ఎలివేషన్ లక్షణాన్ని ఈ అమ్మడు అస్సలు దాచుకోలేదు. తాజాగా మలైకా ఓ అవార్డుల ఈవెంట్ కి హాజరైనప్పుడు ఫోటోగ్రాఫర్ల ముందు హొయలు పోయిన తీరు యూత్ లో చర్చకు వచ్చింది.
మలైకా బ్లాక్ ఫ్రాక్ లో గ్లామ్ లుక్ తో గుబులు పుట్టించింది. మెస్పీ డిజైనర్ ఫ్రాక్ ధరించిన మలైకా ఎద అందాలను ఆరబోసిన తీరు మతులు చెడగొట్టింది. ఆయిలీ టోన్డ్ బిగువులతో జిల్లనిపించడమెలానో మలైకా నుంచి నేటితరం కథానాయికలు నేర్చుకుని తీరాలి. మలైకా మ్యాడ్ అవతార్‌కి ఫిదా అయిపోయిన నెటిజనులు ప్రస్తుతం ఈ వీడియో షూట్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. రియాలిటీ క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతున్న మలైకా రెడ్ కార్పెట్ ఈవెంట్లలో కేంద్రక ఆకర్షణగా మారుతోంది. సోషల్ మీడియాల ద్వారా ఈ భామ భారీగా ఆర్జిస్తోంది. అయితే సినిమాల్లో ఛాన్సులు మాత్రం నిల్.