'అఖండ-2' కోసం బోయపాటి లెక్క ఇదా?
ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు.
బాలకృష్ణ-బోయపాటి తిరుగులేని కాంబినేషన్ అది. ఇప్పటి వరకూ ఆ కలయిక ఫెయిలైంది లేదు. ఇప్పటికే 'సింహ', 'లెజెండ్', 'అఖండ'తో హ్యాట్రిక్ నమోదు చేసారు. డబుల్ హ్యాట్రిక్ ట్రై చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవలే 'అఖండ-2' ని లాంచ్ చేసారు. అలా బోయపాటి-బాలయ్య అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ప్రస్తుతం 'అఖండ-2' కోసం బోయపాటి రెడీ అవుతున్నాడు. 'డాకు మహారాజ్' రిలీజ్ అవ్వగానే బాలయ్య అఖండ-2 కోసం రంగంలోకి దిగుతారు.
భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వస్తున్నారు. అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అందుకే అఖండ-2ని పాన్ ఇండియాలో రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్ ని బోయపాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఈసినిమాకి బోయపాటి తీసుకుంటోన్న పారితోషికం తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే. ఏకంగా 22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడని తెలిసింది.
దీంతో ఇదే బోయపాటి కెరీర్లో భారీ రెమ్యునరేషన్ గా తెలుస్తోంది. ఇంతవరకూ ఏ సినిమాకు ఆయన ఈ రేంజ్ లో తీసుకోలేదు. మహా అయితే 10 కోట్ల వరకూ అందుకున్నారు. కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్నారు.
వాస్తవానికి అంఖడ హక్కులు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. రెండవ భాగాన్ని కూడా ఆయనే నిర్మించాలి. కానీ ఆయన స్థానంలో కొత్త నిర్మాతలు కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు ఫస్ట్ క్లాస్ టెక్నీషి యన్లు తీసుకుంటున్నారు. థమన్ ని యధావిధిగా మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగిస్తున్నారు. అఖండకు ఆయనే సంగీతం అందించిన సంగతి తెలిసిందే.