మల్లారెడ్డి వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫ్యాన్స్ నిప్పులు!
ఆ వ్యాఖ్యలన్ని మల్లారెడ్డి నేరుగా హిందీలోనే వ్యాఖ్యానిం చారు.దీంతో ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి దారి తీస్తున్నాయి.
నిన్నటి రోజున హైదరాబాద్ లో జరిగిన 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి మల్లా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో ఐదేళ్లలో హిందుస్తాన్.. బాలీవుడ్..హాలీవుడ్ ని..తెలుగు ప్రజలు రూల్ చేస్తారని.. ముంబై పాతదైపోతుందని..బెంగుళూరు ట్రాఫిక్ జామ్' అంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు..యానిమల్ హీరో రణబీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఆయన మాటలకు ఎలా రియాక్ట్ కావాలో ఆయనకీ అర్దం కాలేదు. వెంటనే తలపట్టుకుని కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఆ వ్యాఖ్యలన్ని మల్లారెడ్డి నేరుగా హిందీలోనే వ్యాఖ్యానిం చారు.దీంతో ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. హిందీ నటుల ముందే బాలీవుడ్ ని కించపరుస్తారా? ఇవేం వ్యాఖ్యలు..నలుగురు ఉన్నప్పుడు పబ్లిక్ లో ఇలా మాట్లాడుతారా? అదే వేదికపై సల్మాన్ ఖాన్ గనుక ఉంటే మల్లారెడ్డి వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ పడిపోయేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.
సన్నివేశం చూస్తుంటే మల్లారెడ్డి వ్యాఖ్యల వివాదం పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి. ఆయన ప్రజాప్ర తినిధి హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ చర్చనీయాం శగానూ మారుతున్నాయి. మరి వీటిపై బాలీవుడ్ లో మిగతా నటుల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందన్నది చూడాలి. అలాగే మల్లారెడ్డి వీటికి వివరణ ఇస్తారా? అన్నది ఆసక్తికరమే. మల్లారెడ్డి యూనిర్శిటీలోనే 'యానిమల్' ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ప్రాంగణంలో వేలాది మంది జనాలు ఉన్నారు. మల్లారెడ్డి గురించి తెలుగు అభిమానులకు తెలుసు కాబట్టి! పెద్దగా పట్టించుకోరు. ఆయన గత ఇంటర్వ్యూల్లో సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కానీ తెలుగు మీడియా వాటిని పెద్దగా ఫోకస్ చేయలేదు. సరదా వ్యాఖ్యలుగానే పరిగణించింది. కానీ ఈసారి సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది.