హీరోయిన్ రష్మికకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఛాలెంజ్!

ఈ సందర్భంగా... అటల్ సేతుపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన్నకు కేరళ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.

Update: 2024-05-18 05:24 GMT

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ సినిమా నటుల ఎంట్రీలు, రియాక్షన్ లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో తాజాగా "నేషనల్ క్రష్" రష్మిక... అటల్ సేతు వంతెనపై ఒక వీడియో చేయడం.. అభినందించడం.. ఆ వీడియోపై మోడీ & కో రియాక్ట్ అవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది.


అవును... ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దాదర్ నుండి నవీ ముంబైకి రెండున్నర గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గించిందంటూ రష్మిక మందన్న చేసిన వీడియో & కామెంట్స్ పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలను ప్రస్థావిస్తూ... అదే వంతనపై మరో వీడియో చేయాలని సవాల్ చేసింది.

ఈ సందర్భంగా... అటల్ సేతుపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన్నకు కేరళ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఇప్పటి వరకు పెయిడ్ యాడ్స్, సర్రోగేట్ యాడ్స్ మాత్రమే చూశామని, ఇప్పుడు తాజాగా ఈడీ డైరెక్షన్ లో వచ్చిన యాడ్ ను చూస్తున్నామంటూ ఎద్దేవా చేసింది. ఇదే సమయంలో మీరు షేర్ చేసిన వీడియోలో అటల్ సేతు ఖాళీగా ఉన్నట్లు గమనించామని వివరించింది.

ఇదే సమయంలో... కేరళ నుంచి వచ్చాం కాబట్టి, ముంబైలో ట్రాఫిక్ తక్కువగా ఉందని భావించాం.. ఇదే విషయాన్ని ముంబై కాంగ్రెస్ మిత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం.. అటల్ సేతుతో పోల్చితే రాజీవ్ గాంధీ బాంద్రా-వర్లీ సీ లింక్‌ ను వాహనదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి.. అంటూ ఒక వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఈ సందర్భంగా వీడియో ఒక్కటే కాదు.. కొంత డేటాను కూడా పరిశీలించామని మొదలుపెట్టిన కేరళ కాంగ్రెస్... రూ.1,634 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 5.6 కి.మీ బాంద్రా-వర్లీ సీ లింక్‌ ను 2009లో ప్రారంభించారు. ఎలాంటి షో ఆఫ్ లేకుండా ప్రారంభించబడిందంటూ వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. ప్రతి కారుకు కేవలం రూ.85 వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

ఇదే క్రమంలో... అటల్ సేతును రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించారని గుర్తు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఒక్కో కారుకు ఒక్క ట్రిప్‌ కు రూ.250 టోల్ వసూళు చేస్తున్నారని.. ఈ ధర కామన్ మేన్ భరించే పరిస్థితి లేదని.. జనవరి 12న ఈ బ్రిడ్జి ప్రారంభం కాగా, ఏప్రిల్ 23 వరకు రూ.22.57 కోట్లు టోల్ వసూళు అయ్యిందని.. అంటే నెలకు రూ. 6.6 కోట్లు వసూళు అవుతుందని వివరించింది.

ఈ నేపథ్యంలో... నెలకు ర్రు. 6.6 కోట్ల లెక్కన చూసుకుంటే రూ.17,840 కోట్ల పెట్టుబడిని తిరిగి పొందేందుకు సుమారు 225 సంవత్సరాలు పడుతుంది.. ఇక వడ్డీకి లెక్కే లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి అటల్ సేతు నుంచి నెలకు రూ. 30 కోట్లు వస్తుందని భావించారని.. ఇప్పుడు అంత రావడం లేదని.. ముంబై వాసులు ఈ బ్రిడ్జిని ఎందుకు ఉపయోగించట్లేదో ఓ వీడియో చేస్తే బాగుంటుందంటూ రాసుకొచ్చింది.

Tags:    

Similar News