దేవరకు వెళ్తున్నారా? ఈ '8' డోంట్ మిస్ బాసూ!

ఆరేళ్ల తర్వాత తమ ఫేవరెట్ హీరో సోలో మూవీ వస్తుండడంతో.. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు.

Update: 2024-09-26 11:25 GMT

దేవర.. దేవర... దేవర.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చ! టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర పార్ట్ -1పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ పడుతుందా.. అని వరల్డ్ వైడ్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఆరేళ్ల తర్వాత తమ ఫేవరెట్ హీరో సోలో మూవీ వస్తుండడంతో.. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు.

అయితే దేవర రిలీజ్ కు ముందే బోలెడు రికార్డులు సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు క్రియేట్ చేసింది. వేరే లెవల్ లో ప్రీ బుకింగ్స్ జరుపుకుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా అందుకోని పలు ఘనతలు సాధించింది. ఇప్పుడు మరికొన్ని గంటల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. దేవర మేకర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు.

కచ్చితంగా మూవీ చూడాలనేంతగా హైప్ నెలకొల్పారు. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు.

అదే సమయంలో ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ను ఎవరూ అస్సలు మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ ను మేకర్స్ క్రియేట్ చేశారు. దీంతో సినీ ప్రియులు.. కూడా వాటిని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు వాటికోసమే సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. తారక్ ఫ్యాన్స్.. అంతా వాటిని పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎనిమిది ఎలిమెంట్స్ ను మిస్ అవ్వొద్దని సూచిస్తున్నారు. అవేంటంటే?

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. చివర్లో ఆయుధ పూజ సాంగ్ ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. కానీ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో ఆ పాటను స్క్రీన్ పై కచ్చితంగా చూడాల్సిందే! అదే సమయంలో ఫియర్ సాంగ్, దావూది పాటను మిస్ అవ్వొద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు. ట్రైలర్ చివర్లో చూపించిన తారక్, షార్క్ అండర్ వాటర్ సీక్వెన్స్ డోంట్ మిస్ అంటున్నారు.

మాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీలో విలన్ భైర మధ్య జరిగే దేవర కుస్తీ ఫైట్, బోట్ ఫైట్ సహా మరో మూడు యాక్షన్ సీక్వెన్స్ ను కచ్చితంగా చూడాల్సిందేనని చెబుతున్నారు. ఇక సినిమాలో తారక్.. తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర మూవీ ఎలాంటి హిట్ కానుందో.. 8 ఎలిమెంట్స్ ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News