సూర్య, ధనుష్, రజినీ, అమీర్.. కొత్త కబురు ఏంటంటే?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ లు నడుస్తుంటాయన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-22 00:30 GMT

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ లు నడుస్తుంటాయన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అనేక మంది స్టార్ హీరోలు సింగిల్ గా నటిస్తూనే.. మిగతా కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంటారు. దానికి తోడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దాదాపు అన్ని సినిమాలు తెరకెక్కుతుండడంతో పలువురు స్టార్ హీరోలు.. మిగతా హీరోల చిత్రాల్లో నటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే కోలీవుడ్ సినీ వర్గాల్లో రెండు ఆసక్తికరమైన కలయికలకు సంబంధించి వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి దాదాపు ఖరారు అయినట్లు టాక్ వస్తోంది. త్వరలోనే అనౌన్స్మెంట్స్ రానున్నాయట. స్టార్ హీరో సూర్య సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారట. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో ధనుష్ ముఖ్యమైన రోల్ లో కనిపించనున్నారట. ఆ రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కు సీక్వెల్స్ అని తెలుస్తోంది.

సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన గజినీ మూవీ.. అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత పలు భాషల్లో రీమేక్ అవ్వగా.. అక్కడా మంచి హిట్స్ అయ్యాయి. టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు గజినీ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని.. అందులో అమీర్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో గజినీ సీక్వెల్ పై అప్పుడే సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్.. రజినీకాంత్ తో జైలర్ మూవీ తెరకెక్కించి ఎలాంటి హిట్ సాధించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం.. జైలర్ సీక్వెల్ ను కూడా తీస్తున్నట్లు నెల్సన్ ప్రకటించారు.

స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని.. ప్రొడక్షన్‌ హౌస్ సన్‌ పిక్చర్స్‌ నిర్మించనుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు జైలర్-2లో కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా ఆయన కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మొత్తానికి ఈ రెండు అప్డేట్స్.. నిజమో కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి.

Tags:    

Similar News