సుకుమార్ ఆ హీరోని హోల్డ్ లో పెట్టేసాడా?
మెగా పవర్ స్టార్ 17వ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే
మెగా పవర్ స్టార్ 17వ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇంత కాలం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ లాక్ అయినట్లు మొన్నటి రోజున అధికారికంగా రివీల్ చేయడంతో క్లారిటీ వచ్చేసింది. చరణ్ తో బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న 16వ సినిమా తర్వాత సుకుమార్ లైన్ లోకి వచ్చే స్తారు. ఈ లోపు లెక్కలు మాష్టారు ఆన్ సెట్స్ లో ఉన్న 'పుష్ప-2' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసు కురావడం జరుగుతుంది.
మరి రౌడీబోయ్ విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి? అంటే తాత్కాలికంగా అతడి ప్రాజెక్ట్ ని సుకుమార్ పక్కనబెట్టినట్లేనని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 తర్వాత లెక్కలు విజయ్ తోనే సినిమా చేస్తాడని....అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని.... ఓ సంచలన లవ్ స్టోరీ తో ఆ కాంబినేషన్ చేతులు కలుపుతుందని బలమైన ప్రచారం సాగింది.
అయితే తాజా సమీకరణాల నేపథ్యంలో ఇప్పట్లో ఆ కాంబినేషన్ సాధ్యం కాదని తెలుస్తోంది. తాత్కా లికంగా ఆ ప్రాజెక్ట్ ని పక్కనబెట్టేసి ఇద్దరు వేర్వేరు చిత్రాలతో బిజీ అవుతున్నట్లు కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కూడా ఖాళీగా లేడు. ఇటీవలే పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' చిత్రం షూటింగ్ పూర్తి చేసాడు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ పనులు పూర్తికాగానే విజయ్ ..గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు.
ఇప్పటికే సినిమా లాంచ్ అయినా సెట్స్ కి మాత్రవ వెళ్లలేదు. ఇకపై ఆ సినిమా షూట్ పనుల్లోనే బిజీగా ఉంటాడని తెలుస్తోంది. ఈలోగా పూరి గనుక డబుల్ ఇస్టార్ట్ తో హిట్ అందుకేంటే గనుక మళ్లీ రౌడీబోయ్ ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇద్దరి కాంబినేషన్ లో మొదలైన 'జనగణమన' చిత్రీకరణ షూటింగ్ మధ్యలో ఆపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని పూరి భావిస్తున్నారు. అదంతా జరగాలంటే? డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి.