.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఆ ఇద్ద‌రు క‌లిస్తే ర‌చ్చ ర‌చ్చేగా!

ఎస్ .జె సూర్య‌- ప‌హాద్ పాజిల్ ఎంత‌టి ప్ర‌తిభావంతుల‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రికీ విల‌క్ష‌ణ నటులుగా మంచి గుర్తింపు ఉంది

Update: 2024-06-30 10:59 GMT

ఎస్ .జె సూర్య‌- ప‌హాద్ పాజిల్ ఎంత‌టి ప్ర‌తిభావంతుల‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రికీ విల‌క్ష‌ణ నటులుగా మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రలైనా అవ‌లీల‌గా పోషించ‌గల న‌టులు. అందులోనూ నెగిటివ్ పాత్ర‌లిస్తే చెల‌రేగిపోయే న‌టులు. ఒకరికొక‌రు పోటీ ప‌డి న‌టించ గ‌ల సత్తా ఉన్న న‌టులు. మ‌రి అలాంటి న‌టులు ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

తాజాగా ఆ ద్వ‌యం అందుకు సిద్ద‌మ‌వుతోంది. స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గరాజ్ అందించిన క‌థ‌తో 'రెమో' ఫేం భాగ్య‌రాజ్ క‌న్న‌న్ 'బెంజ్' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర బాధ్య‌త‌లు ప‌హాద్ పాజిల్ కి అప్ప‌గించారు.

మ‌రో కీల‌క పాత్ర కి ఎస్ జె సూర్య‌ని ఎంపిక చేసారు. రెండు పాత్ర‌లు సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ని అంటున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఇద్ద‌రు న‌టుల్ని ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే విశ్వ‌రూపం చూపిస్తార‌ని అభిమానులు అప్పుడే కామెంట్లు షురూ చేసారు. ఇంత‌వ‌ర‌కూ సూర్య‌-ప‌హాద్ క‌లిసి న‌టించింది లేదు. తొలిసారి క‌లిసి ప‌నిచేస్తున్నారు. దీంతో తెర‌పై ఇదోక కొత్త ఫీల్ ని అందిస్తుంద‌ని చెప్పొచ్చు.

Read more!

'జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ ఎల్ 'లో లారెన్స్-సూర్య క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. తెలుగులోనూ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి బాగానే క‌నెక్ట్ అయింది. వైవిథ్య‌మైన ఎంట‌ర్ టైన‌ర్ గా గుర్తింపు ద‌క్కించుకుంది. ఎస్. జె సూర్య ద‌ర్శ‌కుడిగా ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ ఇప్పుడు డైరెక్ష‌న్ ప‌క్క‌న‌బెట్టి పూర్తిగా న‌టుడిగానే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 'పుష్ప' సినిమాతో ప‌హాద్ పాజిల్ తెలుగు నాట బాగా ఫేమ‌స్ అయిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News