టార్చర్ నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు!
స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్ సినిమా ఆలస్యమవుతుందంటే అభిమానుల నుంచి ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్ సినిమా ఆలస్యమవుతుందంటే అభిమానుల నుంచి ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే చంటుడు మామూలుగా ఉండదు. ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే కొద్ది ఒత్తిడి అంతకంతకు ఎక్కువవుతుంటుంది. చివరికి ఆ ఒత్తిడి ఎన్నో రకాల విమర్శలకు దారి తీస్తుంది. నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. ఈ విషయంలో ఎంతటి వారినైనా వదిలే ప్రశక్తే లేదంటూ ఓ వర్గం కాచుకుని కూర్చుంటుంది.
`దేవర` సినిమా విషయంలో కొరటాల శివ- తారక్ ఎంత నెగిటివిటీ..ఎన్నిరకాల విమర్శలు ఎదుర్కున్నారో తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టాలెక్కే వరకూ అభిమానులే వెంటాడి వేదించారు. ఆ కాంబినేషన్ అనే కాదు భారీ అంచనాలున్న ఏ కలయిక పరిస్థితి అలాగే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువగా డైరెక్టర్ వ్యక్తిగతంగా టార్గెట్ అవుతుంటాడు. ప్రాజెక్ట్ భారమంతా అతనిపైనే ఉండటంతో సహజంగా చోటు చేసుకునే సన్నివేశమే అది.
అయితే ఈ రకమైన టార్చర్ నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు దర్శక ధీరుడు రాజమౌళి అనడంలో ఎలాం టి సందేహం లేదు. జక్కన్నకి మాత్రం అభిమానులు కూల్ గా పనిచేసుకునే ప్రశాంతతని కల్పిస్తున్నారు. నిదానమే ప్రధానం అన్నంత స్వేచ్ఛని రాజమౌళికి మాత్రమే అభిమానులు ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రకటించిన ఏడాది తర్వాత ఆ చిత్రాన్ని ప్రారంభించడం..పూర్తి చేయడం జరిగింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ తో పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ప్రకటించి కొన్ని నెలలు గడుస్తోన్న సంగతి తెలిసిందే.
రాజమౌళి డైరెక్ట్ చేసిన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ తర్వాత రకరకాల పనుల్లో బిజీ అయ్యారు. ఇదే సమయంలో మహేష్ సినిమా పనులు కూడా మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ సినిమా పనులు అలా జరుగుతున్నాయి. ఇంతవరకూ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది లేదు. కనీసం ప్రారంభో త్సవం కూడా జరగలేదు. అయినా అటు మహేష్ అభిమానుల నుంచి గానీ..ఇటు రాజమౌళి అభిమానుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. ఇంత వరకూ ఒక్క విమర్శ కూడా వినిపించలేదు. ఇలా విమర్శ లు...ఒత్తిడి లేకపోవడంతోనే జక్కన్న మరింత ప్రశాంతంగా పనిచేయగల్గుతున్నారు. తన సినిమాలతో అద్భుతాలు సృష్టించగల్గుతున్నారు.