థియేటర్స్ కి పైరసీ కంటే ఆ టెన్షన్ ఎక్కువైంది

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలని వందల కోట్ల రూపాయలు పెట్టి ఓటీటీ చానల్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి

Update: 2024-01-19 11:30 GMT

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలని వందల కోట్ల రూపాయలు పెట్టి ఓటీటీ చానల్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ డిజిటల్ రైట్స్ కారణంగా నిర్మాత పెట్టిన పెట్టుబడిలో 50 శాతం వరకు రికవరీ అయిపోతుంది. ఏ నిర్మాతకి అయిన పెట్టిన పెట్టుబడి రిలీజ్ కి ముందే రికవరీ అయిపోవాలనే కోరిక ఉంటుంది. స్టార్ హీరోలతో చేసే సినిమాలకి చాలా వరకు నిర్మాతలు సేఫ్ జోన్ లోనే బిజినెస్ చేస్తారు.

డిజిటల్, శాటిలైట్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా చేసుకుంటారు. ఇక థీయాట్రికల్ రైట్స్ ని డిస్టిబ్యూటర్స్ భారీ ధరలు పెట్టి కొనుగోలు చేస్తారు. సినిమా మీద ఉన్న హైప్, ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా కలెక్షన్స్ సాలిడ్ గా వస్తాయని డిస్టిబ్యూటర్స్ నమ్మకం. పెద్ద హీరోల సినిమాల విషయం చాలా సందర్భాలలో ఆ నమ్మకం నిజం అవుతుంది.

సినిమాకి బ్యాడ్ మౌత్ టాక్ వస్తే మాత్రం ఇక మునిగిపోవాల్సిందే. అయితే ప్రభుత్వంతో మాట్లాడి టికెట్ ధరలు కూడా ఈ మధ్య పెంచుకుంటున్నారు. సినిమా బడ్జెట్ బట్టి ప్రభుత్వం ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తోంది. ఇలా సినిమా బిజినెస్ అంతా బాగానే ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే డిజిటల్ ఓటీటీ మాధ్యమాలు వచ్చిన తర్వాత డిస్టిబ్యూటర్స్ కి టెన్షన్ పెరిగింది. ఒక విధంగా పైరసీ కంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది.

నిజానికి మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినా 90 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు పెట్టుబడి రికవరీ కోసం ఓటీటీ ఛానల్స్ కి ఎలాంటి కండిషన్స్ లేకుండా హక్కులు అమ్మేస్తున్నారు. అయితే తక్కువ టైంలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటేనే ఓటీటీ ఛానల్స్ కూడా పదుల నుంచి వందల కోట్లలో హీరో మార్కెట్ బట్టి రైట్స్ కోసం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి.

నిర్మాత సేఫ్ జోన్ లో ఉండటం కోసం వారికి నచ్చినట్లు హక్కులు ఇచ్చేస్తున్నారు. అయితే ఓటీటీ ఛానల్స్ మాత్రం కనీసం నెలరోజులు కూడా కాకుండానే స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాయి. అప్పటికి థియేటర్స్ లో సినిమా ఆడుతూ ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ అని ఎప్పుడైతే తెలుస్తుందో కలెక్షన్స్ మొత్తం డ్రాప్ అయిపోతున్నాయి. సలార్ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ఇంకా నెల రోజులు కాకుండానే ఓటీటీ రిలీజ్ ఎనౌన్స్ చేసేశారు. గతంలో\ భగవంత్ కేసరి విషయంలో అదే జరిగింది. ఇలా నెల రోజులు కాకుండానే రిలీజ్ చేయడం వలన డిస్టిబ్యూటర్స్ దారుణంగా నష్టపోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News