బికినీలో తెలుగమ్మాయి.. అలా స్విమ్ చేస్తూ..

సముద్రం తీరంలో అమ్మడు స్విమ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది జ్ఞానేశ్వరి.

Update: 2024-05-26 13:30 GMT

టాలీవుడ్‌లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ మెరిసిపోతున్న ఎంతో మంది తెలుగు నటీమణుల మధ్య, వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా మంచి గుర్తింపును పొందారు. పెళ్లి చూపులు షోతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ షోలో ఆమె విజయం సాధించి, తనను ప్రూవ్ చేసుకున్నారు.

 

జ్ఞానేశ్వరి కెరీర్‌లో పెళ్లి చూపులు షో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. మిస్టర్ అండ్ మిస్ మూవీలో హీరోయిన్‌గా నటించి, నీ జతగా, మాయలో, చక్రవ్యూహం వంటి సినిమాలలో మంచి పాత్రలను పోషించారు. రీసెంట్ గా వచ్చిన మంత్ ఆఫ్ మధు చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌లో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 

సినిమాలు, వెబ్ సిరీసులతో ఎంత బిజీగా ఉన్నా, జ్ఞానేశ్వరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గ్లామరస్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ, తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ఇటీవల, బికినీతో పాటు పొట్టి డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేసి, కుర్రకారును మంత్రముగ్ధులను చేశారు.

సముద్రం తీరంలో అమ్మడు స్విమ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది జ్ఞానేశ్వరి. ప్రస్తుతం వెకేషన్‌లో ఉంటూ, టూ పీస్ బికినీతో హీట్ పెంచేస్తోంది. అలాగే అందమైన ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

జ్ఞానేశ్వరి గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ, కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. బికినీలో జ్ఞానేశ్వరి అందాలు అదుర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోలకు ఫ్లాట్ అవ్వకుండా ఎవరు ఉండగలరు అని ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరింత విజయవంతమైన అవకాశాలు అందుకోవాలి అని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News