ప్ర‌భాస్ టికెట్ కొనిస్తే పాట చూసొచ్చేసిన‌ హంసానందిని!

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ తో ఉన్న అనుబంధాన్ని న‌టి హంసానందిని గుర్తు చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది.

Update: 2024-07-03 01:30 GMT

'క‌ల్కి 2898' విజ‌యంతో ప్ర‌భాస్ పేరు మ‌ళ్లీ ఇండియా వైడ్ మారుమ్రోగిపోతుంది. భారీ వ‌సూళ్ల‌తో సినిమా దూసుకుపోతుంది. ఇప్పుడెక్క‌డ చూసినా క‌ల్కి టాపిక్ న‌డుస్తోంది. అందులోనూ ప్ర‌భాస్..బుజ్జి గురించి ప్ర‌త్య‌కంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ తో ఉన్న అనుబంధాన్ని న‌టి హంసానందిని గుర్తు చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌భాస్ తో ఉన్న గ‌త అన‌భ‌వాన్ని అమ్మ‌డు గుర్తు చేసుకుంది.

'మిర్చి' షూటింగ్ అయిన త‌ర్వాత నేను మ‌రో సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాను. ఆ సినిమా ఆడియో వేడుక‌కు కూడా వెళ్ల‌లేదు. రిలీజ్ స‌మ‌యంలో హైద‌రాబాద్ లోనూ లేను. కొన్ని రోజుల త‌ర్వాత మ‌ళ్లీ హైద‌రాబాద్ వ‌చ్చాను. అప్పుడే ఓ పార్టీలో ప్ర‌భాస్ క‌నిపించారు. ఆస‌మ‌యంలో నీ సాంగ్ పెద్ద హిట్ అయింద‌ని అన్నారు? ఆ విష‌యం నీకు తెలుసా? అన్నారు. నేను సినిమా చూడ‌లేదని చెప్పాను.

దీంతో వెంట‌నే ఆయ‌న టికెట్ బుక్ చేసి సినిమా చూడు అన్నారు. అంతేకాదు సినిమాలో నా పాట ఎప్పుడు వ‌స్తుందా? టైమ్ కూడా చెప్పారు. స‌రిగ్గా ఆటైమ్ కి థియేట‌ర్ కి వెళ్లి ఆ పాట చూసి వ‌చ్చాను. నేను చాలా సంతోషంగా ఫీల‌య్యాను` అంది. అయితే అమ్మ‌డు కేవ‌లం పాట చూసి వ‌చ్చేయ‌డంపై డార్లింగ్ అభిమానులు ఫీల‌య్యారు. అభిమానంతో టికెట్ కొనిస్తే సినిమా చూడ‌కుండా..కేవ‌లం నీ పాట ఒక్క‌టే చూసి వ‌చ్చేయ‌డం, ఇది కాస్త ఓవ‌ర్ గా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

క్యాన్స‌ర్ ని జ‌యించిన హంసానందిని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కానీ మునుప‌టిలా అవ‌కాశాలు రావ‌డం లేదు. ఏ భాష‌లో ఛాన్స్ వ‌చ్చినా చేయాల‌ని ఎదురు చూస్తోంది గానీ ఆ ఛాన్స్ రావ‌డం లేదు. సోషల్ మీడియాలో మాత్రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. కొత్త కొత్త ఫోటోల‌తో ఆల‌రిస్తుంది.

Tags:    

Similar News

eac