పార్టీ ఇచ్చి జేబు గుల్ల చేసుకున్న ఫేమస్ సింగర్!
సెలబ్రిటీల కల్చర్ లో పార్టీలు అనేవి ఓ భాగం. పార్టీల్లో రకరకాల పార్టీలున్నాయి. ఎవరికి నచ్చిన పార్టీలు వాళ్లు చేసుకుంటుంటారు.
సెలబ్రిటీల కల్చర్ లో పార్టీలు అనేవి ఓ భాగం. పార్టీల్లో రకరకాల పార్టీలున్నాయి. ఎవరికి నచ్చిన పార్టీలు వాళ్లు చేసుకుంటుంటారు. కానీ పార్టీ అనేది పద్దతి తప్పితేనే ఇలా జేబు గుల్ల అవుతుంది. అప్పులు చేసి రోడ్డుల పాలవుతాం అనడానికి ఎన్నో ఉదహారణలున్నాయి. తాజాగా బాలీవుడ్ ఫేమస్ సింగర్ హనీసింగ్ తన పార్టీ అనుభవాన్ని పంచుకుని షాక్ ఇచ్చాడు. సరదాగా మొదలు పెట్టిన పార్టీకి ఖర్చు 38 లక్షలు అయ్యే సరికి అతడి సైతం విస్తుపోయినట్లు తెలిపాడు.
నాజీవితంలో డబ్బు అంతా పార్టీలకే ఖర్చు చేసాను. ఇంటినుంచి బయల్దేరే ముందు జేబు నిండా డబ్బు పెట్టుకుని వెళ్తాను. కానీ పార్టీ ప్లేస్‌కి వెళ్లి వచ్చే సరికి ఒక్క రూపాయి జేబులో ఉండదు. అంతా ఖర్చు అయిపోతుంది. ఓసారి దుబాయ్ లో 8 మంది ఓ పార్టీలో కూర్చున్నాం. దుబాయ్ అంటే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ ధరలు ఎక్కువే. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు అలా లేవు అనుకోండి. స్నేహితులంతా కలిసి ఒకే చోట మందు తీసుకుంటున్నాం.
మా టేబుల్ దగ్గరకు అమ్మాయిలు కూడా వచ్చారు. 23 మంది అమ్మాయిల్ని పార్టీలో జాయిన్ చేసుకున్నాం. బాగా తాగి పుల్లుగా తిన్నాం. చివరిగా అంతా పూర్తయిన తర్వాత బిల్లు వచ్చింది. ఎంత కట్టాలి? అని అడిగితే 38 లక్షలు అని చెప్పారు. దీంతో షాక్ అయ్యాను. మత్తు వదిలిపోయింది. అప్పటికప్పుడు 38 లక్షలు స్పాట్ పేమెంట్ చేసాను. అందుకోసం ఉన్న క్రెడిట్ కార్డులన్నీ వాడాను. అప్పటి నుంచి పార్టీలంటే కాస్త జాగ్రత్తగా ఉంటున్నాను.
ఏదైనా జాగ్రత్త మంచిదని కొన్ని అనుభవాలతోనే అర్దమవుతుంది. అది నాకు ఓ గొప్ప అనుభవం` అని అన్నాడు.
హనీ సింగ్ ఇటీవలే `గ్లోరీ` అనే ఆల్బమ్ రిలీజ్ చేసాడు. `మిర్జా`, `తూ మేరా 22 మైతేరా` ,` ద ఎక్స్ ఫోజింగ్`, `జోరావర్` సినిమాల్లోనూ నటించాడు.