జగ్గూ భాయ్.. ఈ స్టైల్ కేక

తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరోలలో జగపతి బాబు పేరు టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

Update: 2024-08-15 00:30 GMT

తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరోలలో జగపతి బాబు పేరు టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆయన నటించిన చిత్రాలు ఒకప్పుడు మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేవి. వరుస సినిమాలతో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ సొంతం చేసుకున్నారు. కానీ, ఒక దశలో తన కెరీర్‌ని మరో కోణంలో మలచుకోవాలని నిర్ణయించుకొని, విలన్‌గా రీఎంట్రీ ఇచ్చారు.

ఆ నిర్ణయం ఆయనకు ఎంతగానో కలిసివచ్చింది. విలన్ గా మారిన తరువాత ఆయనకు స్టార్ విలన్ గా గుర్తింపు లభించింది. ఇప్పుడు జగపతి బాబు రెండు చేతులా సంపాదిస్తూ, ఒక పక్క హీరోలకు ధీటుగా ఉండే పాత్రలను చేస్తూనే, మరో పక్క విలన్ గా సపోర్టివ్ రోల్స్ లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడాయన బిజీగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రేపు రిలీజ్ కాబోతున్న "మిస్టర్ బచ్చన్" సినిమాలో కూడా జగపతిబాబు మరో సరికొత్త పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే, ఆయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జగపతి బాబు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆయన ప్రతి ఫోటోతో పాటు తెలుగులో చమత్కారమైన క్యాప్షన్ రాసి అభిమానులను ఆకట్టుకుంటుంటారు.

ఇటీవలే ఆయన బ్లాక్ డ్రస్, సిల్వర్ చైన్స్, స్టైలిష్ బ్యాగ్, బ్లాక్ గాగుల్స్ వేసుకుని స్టైలిష్ లుక్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. దీనికి ఆయన ”వయస్సు పెరిగేకొద్దీ తగ్గించుకుందామనే ప్రయత్నంలో ఉన్నా.. మీకు ఓకేనా..?” అని క్యాప్షన్ రాసి, అభిమానులను అలరించారు. ఈ క్యాప్షన్ కి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ, "మీరు ఇప్పటికీ హీరోలాగానే ఉన్నారు", "మరింత అందం పెంచండి" వంటి కామెంట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.

ఈ ట్రెండ్ చూస్తుంటే, ముందుముందు జగపతి బాబు ఇంకా స్టైలిష్ లుక్స్ లో కనిపించబోతున్నారని చెప్పడం ఆశ్చర్యం కాదు. ఇక ఆయన వయసు 60 లో ఉన్నా కూడా ఇంకా 30 ఏళ్ళ యువకుడి తరహాలో ఉన్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జగపతిబాబు నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో పుష్ప 2 కూడా ఉంది. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News