#జై శ్రీ‌రామ్ ప్రాణ‌ప్రతిష్ఠ‌రోజున‌ 'జై హ‌నుమాన్'

ప్రపంచవ్యాప్తంగా హను-మాన్ చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ద‌క్కింది

Update: 2024-01-23 04:14 GMT

ప్రపంచవ్యాప్తంగా హను-మాన్ చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ద‌క్కింది. ఇంత‌లోనే 'ది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్రీక్వెల్ హ‌ను-మ్యాన్ 200 కోట్ల క్ల‌బ్ లో చేరింది. భార‌త‌దేశంలో 120కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు రామ మందిర ప్రారంభోత్స‌వం రోజున ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ 'జై హ‌నుమాన్' ను ప్రకటించారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఇది హ‌నుమంతుని జీవిత కథతో అత్యంత‌ భారీ కాన్వాస్ తో అత్యుత్త‌మ‌ సాంకేతిక ప్రమాణాలతో మునుపెన్నడూ లేనంత గ్రాండియ‌ర్ గా తెర‌కెక్క‌నుంది. భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ చూడ‌ని గొప్ప విజువ‌ల్ ఫీస్ట్ ని అందించ‌డ‌మే ధ్యేయంగా ప్ర‌శాంత్ వ‌ర్మ దీనికోసం ప‌ని చేస్తున్నారు.


ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ అనుకూలమైన సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచారు. ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని వారు భావించారు. అంతేకాదు.. సీక్వెల్ ప్రారంభ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒకటి ప్రశాంత్ వర్మ దేవత ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకుని క‌నిపించ‌గా, మరొకటి సీక్వెల్ కి హింట్ ఇచ్చిన హను-మాన్ నుండి చివరి సీక్వెన్స్‌ను చూపుతుంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన‌ మరిన్ని వివరాలు తరువాత వెల్లడించ‌నున్నారు.

హను-మ్యాన్ గురించి..

'హనుమాన్' 2024 సంక్రాంతి బ‌రిలో విడుదలైన తెలుగు-భాషా సూపర్‌హీరో చిత్రం. దీనికి ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే గాక .. ర‌చ‌నా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రొడక్షన్‌కి ప్రాణం పోశారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ సహా ప్రతిభావంతులైన నటులతో తెరను పంచుకుంటూ తేజ సజ్జా టైటిల్ పాత్రను పోషించాడు.

అంజనాద్రి అనే కాల్పనిక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. హను మాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) కాల్ప‌నిక క‌థ‌లో ప్రారంభ అధ్యాయం. ఇది సూపర్ హీరోలు కథలతో లీనమయ్యే ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఈ చిత్రం భారతీయ సాంస్కృతిక వార‌స‌త్వాన్ని కాపాడుతూ.. ఫాంటసీ, సాహసం వంటి అంశాల‌ను మిళితం చేసిన అద్భుత‌ విజువ‌ల్ ట్రీట్ గా నిలిచింది.

Tags:    

Similar News