కావ్యా ను అలా చూడలేక ఛానల్ మార్చేవాడిని : రజినీకాంత్‌

రజినీకాంత్ జైలర్ సినిమా తో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే

Update: 2023-07-29 06:05 GMT

సూపర్ స్టార్‌ రజినీకాంత్ జైలర్ సినిమా తో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రజినీకాంత్‌ పాల్గొన్నాడు. తాజాగా చెన్నై లో జైలర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ భారీ ఈవెంట్ కు పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.

జైలర్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రజినీకాంత్‌, తమన్నా, శివ రాజ్ కుమార్‌ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో అనిరుధ్ రవిచంద్రన్‌ పెర్ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. జైలర్‌ సినిమా నిర్మాత కళానిధి మారన్‌ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఐపీఎల్‌ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కళానిధి మారన్ అనే విషయం తెల్సిందే. అందుకే జైలర్ సినిమా ఆడియో విడుదల సందర్భంగా రజినీకాంత్‌ ప్రత్యేకంగా ఆ జట్టు గురించి ప్రస్థావన తీసుకు వచ్చాడు. తెలుగు క్రికెట్‌ ఫ్యాన్స్ కు ఐపీఎల్‌ సమయంలో సోషల్‌ మీడియాలో సందడి చేసే కావ్యా మారన్ సుపరిచితురాలు.

హైదరాబాద్ మ్యాచ్‌ ఉన్న ప్రతి సారి కూడా ఆమె స్టేడియంలో కనిపిస్తూ ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆమె హావభావాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కావ్యా గురించి సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ కూడా జైలర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడాడు.

రజినీకాంత్‌ మాట్లాడుతూ... సన్ రైజర్స్ టీమ్ మ్యాచ్ ఓడిపోయిన సందర్భంలో కావ్యా మారన్‌ పడే బాధను తాను చూడలేక పోయేవాడిని. ఆమెను టీవీలో చూపిస్తున్న సమయంలో ఛానల్ మార్చేవాడిని. చాలా సార్లు కావ్యా నిరాశలో ఉండటం ను చూసి నాకు కూడా బాధగా అనిపించేది. అందుకే వచ్చే సీజన్ కోసం అయినా మంచి ఫ్లేయర్స్ ను తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News