ఫ్యాన్స్‌కి షాక్ ఇవ్వనున్న జాన్వీ..!

జాన్వీ కపూర్‌ కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న పాత్రలు చేసేందుకు, సొంత ఇమేజ్‌ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మరో వెబ్‌ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

Update: 2025-02-14 07:02 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ ఇటీవలే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'దేవర' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ కెరీర్‌లో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో గత ఐదేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ను సొంతం చేసుకోలేక పోయింది. హిందీలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లను సైతం ఈ అమ్మడు చేసిన విషయం తెల్సిందే. జాన్వీ కపూర్‌ కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న పాత్రలు చేసేందుకు, సొంత ఇమేజ్‌ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మరో వెబ్‌ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

గతంలో హిందీలో వెబ్‌ సిరీస్‌ను చేసిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ఈసారి కోలీవుడ్‌లో వెబ్‌ సిరీస్ చేయబోతుంది. శ్రీదేవి అంటే తమిళ్ ప్రేక్షకుల్లో ఇప్పటికీ చాలా అభిమానం ఉంది. అందుకే చాలా కాలంగా జాన్వీ కపూర్ కోలీవుడ్‌ ఎంట్రీ కోసం శ్రీదేవి అభిమానులు, తమిళ్‌ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ అది ఒక వెబ్‌ సిరీస్‌తో కావడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా కోలీవుడ్‌లో ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం విభిన్నమైన వెబ్‌ సిరీస్‌తో తమిళ్‌ ఆడియన్స్‌ ముందుకు వెళ్లబోతుంది.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న పా రంజిత్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్ వెబ్‌ సిరీస్‌ రూపొందబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అణచివేతకు గురి కాబడ్డ ఒక తెగ గురించిన కథతో పా రంజిత్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందించబోతున్నారు. అందుకోసం ఆయన స్క్రిప్ట్‌ రెడీ చేశారు, ముఖ్య పాత్ర కోసం జాన్వీ కపూర్‌ను సంప్రదించారని, అందుకు ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ వెబ్‌ సిరీస్‌లకు కొత్తేం కాదు. కానీ కోలీవుడ్‌లో జాన్వీ ఎంట్రీ ఒక పక్కా కమర్షియల్‌ సినిమాతో ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌లో మొదట నటిగా నిరూపించుకుని, ఆ తర్వాత సినిమాలతో తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి. పా రంజిత్ సినిమా అంటే మ్యాటర్ ఉంటుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి పా రంజిత్‌ వెబ్‌ సిరీస్‌ను చేస్తున్నాడు అంటే కచ్చితంగా మ్యాటర్ ఎక్కువగానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. జాన్వీ కపూర్‌కి నటించడానికి ఎక్కువ స్కోప్ దక్కుతుంది. అందుకే వెబ్‌ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వడం వల్ల తనను తాను నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కమర్షియల్‌ సినిమాతో కాకుండా ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చే విధంగా డీ గ్లామర్‌ లుక్‌లో వెబ్‌ సిరీస్‌లో కనిపించబోతుంది. ముందు ముందు అయినా జాన్వీ కోలీవుడ్‌లో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News