సూర్య 'భారతం' లో 'దేవర' బ్యూటీ?

దేవర ఇంకా విడుదల అవ్వకుండానే ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని జాన్వీ కపూర్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2024-01-18 05:39 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు కమర్షియల్‌ గా హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది. అయితే అందాల ఫోటో షూట్స్ తో సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్‌ హోదాను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్‌ లో దేవర సినిమాతో ఎన్టీఆర్ తో కలిసి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. గతంలో శృతి హాసన్ కి ఎలా అయితే తెలుగు లో హిట్ దక్కిందో ఇప్పుడు అలాగే జాన్వీ కపూర్ కి మొదటి కమర్షియల్‌ హిట్ దక్కబోతుంది అన్నట్లుగా చాలా మంది మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర ఇంకా విడుదల అవ్వకుండానే ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని జాన్వీ కపూర్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు కంగువా సినిమాలో చేస్తూనే మరో వైపు సుధ కొంగర దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే.

సుధా కొంగర సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ దర్శకత్వంలో మహాభారత ఇతివృత్తంతో ఒక సినిమాను చేసేందుకు సూర్య ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలు అయ్యాయి.

పౌరాణిక సినిమా అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడీగా జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఆమెకు ఉన్న గుర్తింపు సినిమాకు హెల్ఫ్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఓం ప్రకాష్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

మహాభారతంలో చాలా ఘట్టాలు ఉంటాయి. మరి ఓం ప్రకాంష్‌ ఈ సినిమా కోసం ఎలాంటి కథాంశంను తీసుకుంటాడు అనేది చూడాలి. సూర్య మరియు జాన్వీ కపూర్ ల జోడీతో రాబోతున్న ఆ మహాభారత సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇప్పటికే మొదలయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News