ఒకదాన్ని మించి మరోటి.. టాలీవుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు..!

ఐతే కల్కి సినిమా విషయంలో బాలీవుడ్ మీడియా కూడా ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తుంది.

Update: 2024-06-28 07:38 GMT

ప్రస్తుతం ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత మీద వేసుకుంది టాలీవుడ్ అందులో భాగంలో కల్కి తో మరోసారి మన సత్తా ఏంటన్నది చూపించింది. బాహుబలితో మొదలైన ఈ పాన్ ఇండియా సినిమాల హంగామా ఇలా కొనసాగుతుంది. బాహుబలి, పుష్ప 1, RRR ఇలా ఒకదానికి మించి మరో సినిమా అనిపిస్తూ అదరగొట్టేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన కల్కి సినిమా ఐతే హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు అనిపించేలా చేసుకుంది.

నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం పడిన కష్టం తెర మీద కనిపించింది. అంతేకాదు సినిమాకు పెట్టిన 500 కోట్ల పైన బడ్జెట్ కూడా వర్తబుల్ అనిపించింది. సినిమాలో ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్, కమల్ హాసన్, దీపికా ఇలా అందరు తమ పాత్రలతో అదరగొట్టారు. ఇక సాధారణంగా తెలుగు నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు బాలీవుడ్ రివ్యూయర్స్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తారు. దాన్ని దాటుకుని కూడా మన సినిమాలు నేషనల్ లెవెల్ లో సంచలనం సృష్టించాయి.

ఐతే కల్కి సినిమా విషయంలో బాలీవుడ్ మీడియా కూడా ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తుంది. సినిమా గురించి అక్కడ విశ్లేషకులంతా బ్లాక్ బస్టర్ అనేశారు. దాని వల్ల సినిమాకు ఇంకాస్త బూస్టింగ్ దొరికింది. బాహుబలి వచ్చాక ఎలాగైతే తెలుగు పరిశ్రమ ఖ్యాతి వ్యాపించిందో కల్కి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాకు అవార్డులు రివార్డులు వస్తాయని చెప్పొచ్చు.

సినిమాను పేపర్ మీద రాసుకోవడం కాదు అంతే గొప్పగా తెరకెక్కించాలని మాస్టర్ క్లాస్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ సరికొత్త స్టోరీ టెల్లర్ గా అవతరించాడు. బాహుబలితో మొదలైన ఈ విధ్వంసం కల్కి తో కూడా కొనసాగుతుంది. కచ్చితంగా ఇండియన్ సినిమా అంటే అందరు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూసేలా మన మేకర్స్ చేస్తున్నారు. కల్కితో హాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా అంటే చాలు మిగతా పరిశ్రమ వాళ్లకు భయం కలిగేలా చేశారు. ఇప్పటికే మన సినిమాలతో పూర్తిగా డామినేషన్ ఏర్పరచుకోగా రానున్న సినిమాలతో ఇది మరింత పెరగనుందని చెప్పొచ్చు. కల్కి 2898 ఏడి తర్వాత పుష్ప 2, కల్కి 2, సలార్ 2, దేవర, రాజమౌళి మహేష్ మూవీ ఇవి కూడా నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించేందుకు వస్తున్నాయి.

Tags:    

Similar News