కల్కి 2898AD… ఇండియన్ 2కి లింక్ పెట్టేశారే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది.

Update: 2024-06-11 04:29 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ప్రేక్షకుల నుంచి కల్కి ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో ట్రైలర్ ఉందనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. అలాగే పబ్లిక్ లోకి కూడా ట్రైలర్ బలంగా వెళ్ళింది.

3 నిమిషాల 3 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తుందని, నెక్స్ట్ లెవల్ విజువలైజేషన్, ప్రెజెంటేషన్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కచ్చితంగా ఈ సినిమాతో హాలీవుడ్ లెవల్ లో ఇండియన్ మూవీ సత్తా ఏంటనేది అందరికి తెలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ట్రైలర్ తో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అయిన కూడా కథ అందరికి అర్ధమయ్యే విధంగానే ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది .

ఈ చిత్రంలో కలిపురుషుడు పాత్రలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించారు. అతని లుక్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. నిజానికి కమల్ హాసన్ చేస్తోన్న క్యారెక్టర్ గురించి నాగ్ అశ్విన్ ట్రైలర్ లో పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. ఒకే ఒక్క ఫ్రేమ్ లో అతన్ని రివీల్ చేశారు. అయితే ఆ లుక్ లో కమల్ హాసన్ భారతీయుడు 2లో సేనాపతి తరహాలోనే ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

ఇండియన్ 2లోని సేనాపతి క్యారెక్టర్ విగ్ తీసేస్తే కల్కిలో కమల్ హాసన్ తరహాలోనే ఉంటాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మ్యాకప్ కి ఖర్చు ఎందుకని నాగ్ అశ్విన్ అదే లుక్ ని కంటిన్యూ చేసి ఉంటాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ లుక్ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా ఉందని కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. కలిపురుషుడు అంటే అలాగే ఉంటాడంటూ రియాక్షన్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే విమర్శలు ఎలా ఉన్న కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ కి ఎలాంటి ఒంక పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో అతని క్యారెక్టరైజేషన్ తో ఏ విధంగా మెప్పిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా ట్రైలర్ కి అయితే ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా పబ్లిక్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషలలో కలిపి 15+ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ని కల్కి ట్రైలర్ ఏ మేరకు బ్రేక్ చేయగలదో లేదో వేచి చూడాలి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ లోనే ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News