జ‌యాబ‌చ్చ‌న్ వివాదంలోనూ త‌ల‌పెట్టిన కంగ‌న‌!

తాజాగా ఈ వివాదంలోకి బాలీవుడ్ న‌టి, మండి నియోజ‌క వ‌ర్గం ఎంపీ కంగ‌న ర‌నౌత్ వేలు పెట్టింది.

Update: 2024-09-02 11:30 GMT

ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ జ‌యాబ‌చ్చ‌న్ ని ఉద్దేశించి `జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్` అంటూ సంబోధించి సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌యాబ‌చ్చ‌న్ ని అలా పిల‌వ‌డంపై అమె అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. 'జ‌యాబ‌చ్చ‌న్' అంటే స‌రిపోతుం ద‌ని..అంత‌గా సాగ‌దీసి చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు.

తాజాగా ఈ వివాదంలోకి బాలీవుడ్ న‌టి, మండి నియోజ‌క వ‌ర్గం ఎంపీ కంగ‌న ర‌నౌత్ వేలు పెట్టింది. జ‌యాబ‌చ్చ‌న్ స్పందించిన తీరును ఆమె త‌ప్పు బ‌ట్టింది. `ఈ విధ‌మైన అహంకార వైఖ‌రి ఉంటే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉన్న బంధంలోనూ ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మ‌నుషులెప్పుడు ఒక‌రికొక‌రు క‌లిసి ఉండాలి. ఇలాంటి క‌ఠిన వైఖ‌రితో వారిని విడ‌దీయ‌కూడ‌దు.

మ‌న పేరు వెనుక మ‌రో వ్య‌క్తి పేరు వ‌చ్చి చేరినంత‌నే కొంత మంది కోపానికి గురవుతున్నారు. తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అంత‌మాత్రానికే త‌మ గుర్తింపు పోతుంద‌నే అందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అలాంటి వారిని చూసిన‌ప్పుడు నాకు బాధ‌గా ఉంటుంద‌ని వ్యంగ్యంగా అంది. ఇది అవ‌మాన‌క‌ర విష‌యం. స్త్రీ-పురుషుల మ‌ధ్య అంద‌మైన వ్య‌త్యాసాన్ని ప్ర‌కృతి సృష్టించింది.

దాన్ని కొంద‌రు వివ‌క్ష‌గా చూస్తున్నారు. స్త్రీ-పురుషులు క‌లిసిన‌ప్పుడే జీవితం అందంగా ఉంటుంది. పార్ల‌మెంట్ వేదిక‌గా పేర్ల విష‌యంలో వివాదం అన్న‌ది చాలా చిన్న‌ది` అని అంది. మ‌రి కంగ‌న వ్యాఖ్య‌ల‌పై జ‌యాబ‌చ్చ‌న్ కౌంట‌ర్ ఇస్తారా? అన్న‌ది చూడాలి. పార్ల‌మెంట్ రికార్డుల్లో జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్ అని ఉంటుంద‌ని నార‌య‌ణ్ సింగ్ అన‌గా, మ‌హిళ‌ల‌కు స్వ‌త‌హాగా గుర్తింపు లేదా? అంటూ జ‌యా బ‌చ్చ‌న్ ఒకింత అసహ‌నానికి లోన‌య్యారు.

Tags:    

Similar News