యష్ నెక్స్ట్.. స్టోరీలైన్ లో పవర్ఫుల్ ఏమోషన్
అయితే టాక్సిక్ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ కి మదర్ సెంటిమెంట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయాడు. ప్రభాస్ తర్వాత దేశంలోనే అత్యధిక క్రేజ్ ఉన్న నటుడిగా యష్ ఉన్నాడు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత అతని కొత్త ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ రెండేళ్లు వెయిట్ చేశారు. ఫైనల్ గా ఈ ఏడాది గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాని యష్ స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీ సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే కేజీఎఫ్ తరహాలోనే మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో టాక్సిక్ మూవీ కూడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథని డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో గీతూ మోహన్ దాస్ సిద్ధం చేసారంట. ఈ చిత్రంలో యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయం బయటకి రాలేదు. అయితే టాక్సిక్ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ కి మదర్ సెంటిమెంట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.
రాకీభాయ్ క్యారెక్టర్ కి తల్లి పాత్రతో ఇచ్చిన ఎలివేషన్ అద్భుతంగా సెట్ అయ్యింది. ప్రేక్షకులకి ఇది బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని టాక్సిక్ సినిమాకి కూడా యష్ కొనసాగిస్తున్నాడంట. ఇందులో కూడా విమెన్ ఫ్యాక్టర్ కి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారంట. స్టోరీ లైన్ ఒక ఎమోషనల్ బాండింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార హ్యూమా ఖురేషి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
వారిద్దరి క్యారెక్టర్స్ కి సినిమాలో మంచి స్కోప్ ఉంటుందంట. ఈ చిత్రంలో యష్ కి అక్కగా నయనతార కనిపించబోతోందని తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తరహాలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారా లేదంటే ఒకే పార్ట్ గా ఉండబోతుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. టాక్సిక్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంటే గీతూ మోహన్ దాస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమాకి గ్యాప్ తీసుకోకుండా వీలైనంత తక్కువ టైంలో పూర్తి చేయడానికి రెడీ అయినట్లు అర్ధమవుతోంది. ఈ మూవీ తర్వాత హిందీలో నితీష్ తివారి తెరకెక్కించే రామాయణం సినిమాలో రావణుడిగా యష్ కనిపించబోతున్నాడంట. ఈ సినిమాస్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. అలాగే కేజీఎఫ్ పార్ట్ 3 కూడా ఉండబోతోందనే టాక్ బయటకొచ్చింది.