కశ్మీర్ ఫైల్స్.. సమైక్యతపై ముదురుతున్న వివాదం..
ఈ చిత్రానికి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని' అందుకే ఈ సినిమాకు ఇప్పుడు జాతీయ అవార్డుకు ఎంపికైందని విమర్శకులు అంటున్నారు.
ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన మొదలు నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. సోషల్‌మీడియా' టెలివిజన్ మీడియాలో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే నిలుస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అందుకు కారణం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం రెండు అవార్డులను అందుకోవడమే. జాతీయ సమగ్రతా చిత్రంగా ఈ సినిమా ఎంపికవ్వగా.. అలాగే చిత్రంలో నటించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు వరించింది.
అయితే ఇప్పుడీ సినిమాకు జాతీయ సమగ్రతా చిత్రంగా అవార్డు ఇవ్వడంపై పెద్ద చర్చ సాగుతోంది. ఈ వివాదం చూస్తుంటే మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఒక అజెండాతో తీసిన ఇలాంటి చిత్రానికి సమగ్రతా చిత్రంగా అని చెప్పే అర్హత లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిరంగంగానే విమర్శించారు. 90 దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోత విషయంలోని తప్పొప్పులను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక కోణంలోనే చూపించారని' దాని వల్ల ఓ వర్గం మీద తప్పుడు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది.
అసలు సమైక్యత ప్రశ్నే లేని కశ్మీర్ ఫైల్స్‌ను సమగ్రతా చిత్రంగా ఎలా గుర్తిస్తారని విమర్శకులు అంటున్నారు. గతంలో ఈ విభాగంలోనే పురస్కారం అందుకున్న బొంబాయి' రోజా' రుద్రవీణ' సప్తపది' షహీద్ ఉద్ధం సింగ్' బోర్డర్' మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్' పుకార్ ఇతర సినిమాల్లో జాతీయ స్థాయిలో సమైక్య వాదం గురించి బాగా చూపించారని' మానవతా విలువలు' సమైక్య జీవన సిద్ధాంతంతో పాటు మనుషులంతా ఒకటేనన్న సందేశం బాగా చూపించారని గుర్తుచేస్తున్నారు. కానీ ఇవేమీ కశ్మీర్ ఫైల్స్‌లో ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.
ఈ చిత్రానికి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని' అందుకే ఈ సినిమాకు ఇప్పుడు జాతీయ అవార్డుకు ఎంపికైందని విమర్శకులు అంటున్నారు. భవిష్యత్‌లో ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాలకు అవార్డు ప్రకటించాలని సూచిస్తున్నారు.
కాగా' కశ్మీర్ ఫైల్స్‌ను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇప్పటికీ ఆయన సినిమాపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం కూడా ఇచ్చారు. ఇకపోతే ఇప్పుడీ దర్శకనిర్మాత నుంచే ది వ్యాక్సిన్ వార్ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 28న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రభాస్ 'సలార్'కు పోటీగా రిలీజ్‌కానుంది.