భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఎమోషన్స్ చుట్టూ కథను ముందుకు తీసుకెళ్లారు.
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా 'ఖుషి'. నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మూవీటీమ్.. తాజా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఓ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసి ప్రచార చిత్రాన్ని రిలీజే చేసింది.
'దీనమ్మ కాశ్మీర్. సేమ్ రోజా సినిమాలానే ఉంది' అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ ఆయన మాట్లాడిన సంభాషణలు కామెడీగా ఉన్నాయి. . 'మీ గురించి తెలియదు కానీ బేగమ్ మాత్రం డైరెక్ట్ స్వర్గ్ సే ఆయే హై' అంటూ సామ్‌పై తన ప్రేమను తెలియజేయడం కూడా బాగుంది. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది.
తాను బేగం కాదు.. బ్రాహ్మిణ్ అంటూ అసలు విషయాన్ని సమంత బయటపెడుతుంది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ సాఫీగా సాగిన జీవితంలో వచ్చే గొడవల నేపథ్యంలో ప్రచార చిత్రాన్ని చూపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఎమోషన్స్ చుట్టూ కథను ముందుకు తీసుకెళ్లారు.
జాతకాల వల్ల విజయ్-సమంత కుటంబంలోని వారు పెళ్లికి ఒప్పుకోకపోవడం, దీంతో వాళ్లని కాదని ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోని సాఫీగా జీవినం సాగించడం, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల గొడవలు ఎదురవ్వడం వంటివి బాగా చూపించారు.
ఈ క్రమంలోనే 'పెళ్లంటేనే చావురా' అని రాహుల్ రామకృష్ణ అనడం, భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా అని విజయ్ అనడం హైలైట్‌గా నిలిచింది. చిన్నపాటి ఫైటింగ్ సీన్స్ కూడా చూపించారు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మరి చివరికి వీరిద్దరూ కలిశారా లేదా అన్నది తెరపై చూడాల్సిందే..
ఇకపోతే శాకుంతలం వంటి డిజాస్టర్ తర్వాత సమంత, లైగర్ వంటి అట్టర్ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ, టక్ జగదీశ్ వంటి ఫ్లాప్‌తో శివ నిర్వాణ్.. ఇలా ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో ఈ ముగ్గురూ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఈ ముగ్గురికి ఖుషి ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో..