కల్కి 2898.. మరో ఎలివేషన్ ఇచ్చిన చిన్నారి

అతి తక్కువ సమయంలో 100 కోట్ల గ్రాస్ ని నార్త్ అమెరికాలో వసూలు చేసిన ఇండియన్ సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది.

Update: 2024-07-02 12:18 GMT

కల్కి 2898ఏడీ మూవీ అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే 625 కోట్లుప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ కలెక్ట్ చేసింది. ఇలాగే కలెక్షన్స్ ట్రెండ్ కొనసాగితే 10 రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతి తక్కువ సమయంలో 100 కోట్ల గ్రాస్ ని నార్త్ అమెరికాలో వసూలు చేసిన ఇండియన్ సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది.


ఇదిలా ఉంటే ఈ సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలలో కనిపించారు. వీరి తర్వాత సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఓ చైల్డ్ యాక్టర్ నటించింది.

సినిమాలో అశ్వద్ధామ తపస్సు చేసుకున్న మందిరంలోకి వెళ్లే రాయ పాత్రలో కియా నాయర్ నటించింది. యాక్టర్ గా ఆమెకి ఇది మొదటి సినిమా అని తెలుస్తోంది. అయిన కూడా ఎలాంటి తడబాటు లేకుండా స్టార్స్ తో కలిసి నటించి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో రాయ పాత్రలో ఆకట్టుకుంది. తపస్సులో ఉన్న అశ్వద్ధామకి బాధ్యతలు గుర్తుచేసే రాయ పాత్ర మూవీలో కియా నాయర్ చాలా కీలకంగా మారింది.

Read more!

అలాగే అశ్వద్ధామ నుదుటిపై ఉన్న మణిని కూడా రాయ తీసుకొస్తుంది. పార్ట్ 2లో కూడా రాయ పాత్ర చాలా కీలకంగా ఉంటుందంట. ఇక ఇప్పటికే పార్ట్ 2 మూవీ 60% షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. మిగిలిన భాగం ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు. రాయ పాత్రలో నటించిన కియా నాయర్ కల్కి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఈ చైల్డ్ యాక్టర్ ఇప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టింది.

మూవీ సక్సెస్ తో కియా నాయర్ కి బాగా ఫేమ్ వచ్చింది. దీంతో యుట్యూబ్ ఛానల్స్ వరుసపెట్టి ఈమె ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈమె పెయింటర్ గా డిఫరెంట్ స్కెచ్ లతో డ్రాయింగ్స్ కూడా వేస్తుంది. కల్కి మూవీ సక్సెస్ తో పూర్తిస్థాయి నటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో షూటింగ్ విశేషాలని, ప్రభాస్ గురించి ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ కియా నాయర్ పంచుకుంది.

కల్కి పార్ట్ 1 కేవలం ఒక స్టార్టర్ మాత్రమే.. ఫుల్ మీల్స్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది అన్నట్లు ఆమె మంచి హైప్ ఇచ్చింది. భైరవ పూర్తి స్థాయిలో కర్ణుడిగా మారితే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ బాల నటి చెప్పిన రెండు మాటలతో సెకండ్ పార్ట్ ఫుల్ మీల్స్ కు తక్కువ ఉండదని అర్ధమవుతుంది. ఇక ప్రభాస్. గురించి మాట్లాడుతూ.. అంత పెద్ద స్టార్ అయిన కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. నేను మొదటి సారి సెట్ లోకి వెళ్ళినపుడు ఆయన అమితాబ్ బచ్చన్ గారి పాదాలకి నమస్కారం చేశారు. ప్రభాస్ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని కియా నాయర్ పేర్కొంది.

Tags:    

Similar News

eac