బాహుబలి ఫార్ములా కొరటాలకు కలిసొచ్చేనా?
అలాగే బాహుబలి కన్ క్లూజన్ లో తండ్రి పాత్ర ముగింపు ఉంటే కొడుకు పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది
'బాహుబలి' ఫార్ములాని కొరటాల శివ వాడుతున్నారా? అమరేంద్ర బాహుబలి..మహేంద్ర బాహుబలి స్పూర్తితో 'దేవర' లో తారక్ రెండు పాత్రల్ని డిజైన్ చేసారా? బాహుబలి తరహాలోనే దేవరలో తారక్ సమాంతరంగా చూపించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. 'బాహుబలి ది బిగినింగ్' లో కొడుకు పాత్ర ఉంటే...సెకెండ్ ఆఫ్ అంతా తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే బాహుబలి కన్ క్లూజన్ లో తండ్రి పాత్ర ముగింపు ఉంటే కొడుకు పగ తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.
ఇప్పుడు దేవరలోనూ కొరటాల ఇదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. దేవర మొదటి భాగంలో కొడుకు పాత్ర...దేవర-2 లో తండ్రి పాత్రల్ని చూపించబోతున్నాడు. ఆ రెండు పాత్రలు ఒకదానికి కొకటి పోటా పోటీగా ఉంటాయని తెలుస్తోంది. ఎలివేషన్ పరంగా తారక్ ని నెక్స్ట్ లెవల్ లోనే చూపించబోతున్నారు? అన్న టాక్ వినిపిస్తుంది. హీరో పాత్రల్ని ఎలివేట్ చేయడంలో కొరటాల కంటూ ఓ స్టైల్ ఉంది.
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా దేవరలో తారక్ పాత్ర ఎలివేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందంటూ అభిమా నుల ఊహకి కూడా అందడం లేదు. దేవర సినిమాని కొరటాల రెండు భాగాలు చేయడానికి కారణం కూడా ఇదే. తండ్రి కొడుకుల పాత్రలు బలంగా ఉండటంతో? ఒకే సినిమాగా చెప్పే కథని రెండుగా విభజించి చెబుతున్నారు. ఇది మార్కెట్ పరంగానూ ఎంతో కలిసొచ్చే అంశం. స్టోరీ గ్రిప్పింగ్ గా చెప్పడానికి వీలైనంత స్పాన్ ఉన్నప్పుడు ఎన్ని భాగాలైనా చేయోచ్చు.
అయితే అందులో పాత్రల్ని బలంగా చూపించగలగాలి. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఆ విషయంలో కొరటాలకు కొట్టిన పిండి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'ఆచార్య' మినహా ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలేవి ప్లాప్ అవ్వలేదు. 'దేవర' సంవత్సరాల తరబడి కసరత్తులు చేసి సిద్దం చేసిన స్టోరీ. మత్సకార తీర ప్రాంతంలో నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాని టెక్నికల్ గానూ హైలైట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సముద్రం సెట్ ఏర్పాటు చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.