అత‌డు మోసం చేసాడ‌ని క‌ల‌త చెంద‌లేద‌న్న సీనియ‌ర్ న‌టి

మాజీ భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో ఉన్న సంబంధం కారణంగా కూడా మ‌హిమా చౌద‌రి హెడ్ లైన్స్ లోకొచ్చింది.

Update: 2024-08-03 09:30 GMT

మహిమా చౌదరి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హిందీ- తెలుగు సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించిన ఈ బ్యూటీ సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన 'పర్దేస్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ‌తో భారీగా అభిమానులను సంపాదించుకుంది. శ్రీ‌కాంత్, జ‌గ‌ప‌తి బాబు వంటి తెలుగు స్టార్ల‌తో మ‌హిమ 'మ‌న‌సులో మాట‌' అనే చిత్రంలో న‌టించింది. మ‌హిమ అంద‌చందాలు న‌ట‌ప్ర‌తిభ‌కు ఇక్క‌డా ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు.

అయితే హిందీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిమ ఎఫైర్లు అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. మాజీ భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో ఉన్న సంబంధం కారణంగా కూడా మ‌హిమా చౌద‌రి హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈ జంట‌ సుమారు 3 సంవత్సరాలు డేటింగ్ చేసారు. టెన్నిస్ క్రీడాకారుడైన లియాండ‌ర్ ఫేస్‌కి తాను అనునిత్యం మద్దతుగా నిలిచంది. పేస్ తన మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆమె ఎప్పుడూ స్టేడియంలో కనిపించేది. అయితే ఈ జంట‌ తరువాత విడిపోయింది. మోడల్ రియా పిళ్లైతో లియాండ‌ర్ ఫేస్ ఎఫైర్ దానికి కారణమని మ‌హిమ ఆరోపించింది.

ఇటీవ‌ల‌ ఒక ఇంటర్వ్యూలో మహిమ తన గత సంబంధాల గురించి మరింత డెప్త్ గా మాట్లాడింది. మ‌హిమ మాట్లాడుతూ..''అతడు మంచి టెన్నిస్ ఆటగాడు కావచ్చు కానీ, నాతో సరిగ్గా ఆడలేదు. అతడు వేరొకరితో తిరుగుతున్నాడని తెలిసినప్పుడు అది నాకు షాకింగ్ వార్త‌ కాదు. అతడి నిష్క్రమణ నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. నేను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందాను. రియా (పిళ్లై)తో కూడా పేస్ అదే పని చేశాడని కూడా మహిమ భావిస్తున్న‌ట్టు తెలిపింది. రియాపై పలు రకాల గృహ హింసలకు పాల్పడినందుకు లియాండ‌ర్ పేస్ దోషిగా తేలాడు. లియాండ‌ర్ రియాతో క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఉమ్మడి నివాసాన్ని విడిచి వెళ్లాలని కోరుకుంటే అత‌డు నెలవారీ రూ. 1 లక్ష భ‌త్యంతో పాటు నెలవారీ అద్దె రూ. 50,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

మహిమ 2006లో ఆర్కిటెక్ట్ కం వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని పెళ్లాడారు. అయితే తర్వాత 2011లో అనుకూలత సమస్యల కారణంగా ఈ జంట విడివిడిగా జీవిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఈ వివాహంలో మ‌హిమ‌కు 8 సంవత్సరాల కుమార్తె అరియానా జ‌న్మించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మహిమ తదుపరి కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' చిత్రంలో పుపూర్ జయకర్ పాత్రను పోషించారు. సాంస్కృతిక కార్యకర్త, రచయిత పుపుల్ జయకర్‌కు నెహ్రూ కుటుంబంతో సన్నిహిత స్నేహం ఉంది. ఈ చిత్రం 6 సెప్టెంబర్ 2024న థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. కంగనాతో పాటు ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రం 1975 - 1977 మధ్యకాలంలో భారతీయ‌ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ కాలం ఆధారంగా రూపొందింది. ఇందులో కంగ‌న ఇందిర‌మ్మ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Tags:    

Similar News