ఫోటో స్టోరి: మలైకా బ్యాక్ లెస్ ఫోజ్
సోషల్ మీడియాల్లో నిరంతరం తన అభిమానులను టీజ్ చేసే 50 ఏళ్ల మలైకా ఇప్పుడు మరో కొత్త ఫోటోషూట్ తో యూత్ హృదయాల్లో గిలిగింతలు పెట్టింది.;
మలైకా అరోరా తన బోయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా మీడియా హెడ్ లైన్స్ లో ఇది ప్రధాన అంశం. ప్రస్తుతం రియాలిటీ షోల జడ్జిగా, ఫ్యాషన్ షోలలో ట్రెండ్ సెట్టర్ గా మలైకా హృదయాలను గెలుచుకుంటోంది. పూర్తిగా తన కెరీర్ పైనే దృష్టి సారించింది. సోషల్ మీడియాల్లో నిరంతరం తన అభిమానులను టీజ్ చేసే 50 ఏళ్ల మలైకా ఇప్పుడు మరో కొత్త ఫోటోషూట్ తో యూత్ హృదయాల్లో గిలిగింతలు పెట్టింది.
మలైకా పూల్ సైడ్ అందంగా స్మైలిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా దూసుకెళుతోంది. స్విమ్ సూట్ లో ఫోటోగ్రాఫ్ కి ఒక అందమైన క్యాప్షన్ ని కూడా జోడించింది మలైకా. 'నాకు నేను బాగా ఇష్టం' అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. ''మనం మన భయంకరమైన 40లలోకి, అద్భుతమైన 50లలోకి, సె* 60లలోకి, సాసీ 70లలోకి ప్రవేశిస్తాము. మనసును మాట్లాడటానికి మరింత స్వేచ్ఛను ఇస్తాము. ఇది చాలా అందంగా ఉంది!'' అని నోట్ లో రాసింది మలైకా. దీనిని బట్టి 40లలో మలైకా ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను ప్రతి ఒక్కరూ సులువుగా గ్రహించగలరు. ప్రేమాయణాలు, పెళ్లి బ్రేకప్ లు వగైరా విషయాలు భయంకరమైనవి అనేది మలైకా ఉద్ధేశం.
సీనియర్ బ్యూటీ మలైకా అరోరా షోకి జడ్జిగా ఉండగా ఇటీవల 16 ఏళ్ల పార్టిసిపెంట్ తనను చూస్తూ అనుచిత హావభావాలతో వేడెక్కించిన వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో టీనేజర్ ని మలైకా చీవాట్లు పెడుతూ కనిపించింది. ఎంఎక్స్ ప్లేయర్ 'హిప్ హాప్ ఇండియా సీజన్ 2' తాజా ఎపిసోడ్‌లో ఈ సంఘటన జరిగింది.
టీనేజీ బోయ్ డ్యాన్స్ రియాలిటీ షోలో మలైకా ను చూస్తూ రెచ్చిపోయాడు. డ్యాన్స్ చేస్తూ, కళ్లతోనే మలైకాను కవ్వించాలని చూసాడు. దీనికి మలైకా నుండి గట్టి స్పందన వచ్చింది. అతడి డ్యాన్స్ ప్రదర్శన తర్వాత మలైకా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ''దయచేసి మీ అమ్మగారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి. మీకు 16 సంవత్సరాలు మాత్రమే.. అయినా నన్ను చూస్తూ, కన్నుగీటుతూ, డ్యాన్స్ సమయంలో ముద్దులు పెడుతున్నారు''అంటూ సీరియస్ అవుతూ.. మలైకా షోని రక్తి కట్టించింది. ఆ కుర్రాడి తండ్రిని వేదికపైకి పిలిచినప్పుడు సీన్ కూల్ అయింది. తరువాత మలైకా - న్యాయమూర్తి రెమో డిసౌజా ఆ టీనేజర్‌తో సరదాగా మాట్లాడారు.