'తప్పు చేస్తే ఒప్పుకోండి'.. జానీ మాస్టర్ కు మనోజ్ సలహా!

ఏ విషయంలోనైనా ఎవరిది రాంగ్.. ఎవరిది రైట్ అనేది చట్టం నిర్ణయిస్తుందని మనోజ్ తెలిపారు.

Update: 2024-09-19 10:39 GMT

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అవ్వడం.. పోలీసులు అతడిని అరెస్టు చేయడం.. ఇదంతా తెలిసిందే. గోవాలోని అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత రీసెంట్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రావడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే జానీ మాస్టర్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందించగా.. ఇప్పుడు హీరో మనోజ్ ఎక్స్ లో రెస్పాండ్ అయ్యారు. ఈ మేరకు సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వచ్చేందుకు జానీ మాస్టర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసని మనోజ్ అన్నారు. కానీ రీసెంట్ గా అతడిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయని తెలిసి తన మనసు ముక్కలైందని తెలిపారు. ఏదేమైనా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని చెప్పారు.

ఏ విషయంలోనైనా ఎవరిది రాంగ్.. ఎవరిది రైట్ అనేది చట్టం నిర్ణయిస్తుందని మనోజ్ తెలిపారు. కానీ సదరు మహిళ తన గొంతు వినిపించినప్పుడు.. పారిపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అది ఫ్యూచర్ జెనరేషన్లకు ఒక డేంజర్ మెసేజ్ ఇస్తుందని మనోజ్ అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ కేసు విషయంలో వెంటనే స్పందించిన హైదరాబాద్, బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ప్రూవ్ చేసినట్లు చెప్పారు.

కాగా, నిజాన్ని ఎదుర్కోండని జానీ మాస్టర్ ను మనోజ్ సూచించారు. ఎలాంటి తప్పు చేయకపోతే పోరాటం చేయమని సలహా ఇచ్చారు. కానీ దోషి అయితే మాత్రం.. వెంటనే అంగీకరించడని హితవు పలికారు. అదే సమయంలో మహిళల భద్రత సెల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను కోరారు. అందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయమని సజ్జెస్ట్ చేశారు. ఇప్పటికే 'మా'.. ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలకు ఒక గళంగా నిలవండని మనోజ్ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలతో పాటు సహచరులకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. న్యాయం, గౌరవం.. ఈ రెండూ మాటల వరకే కాదు.. చేతుల్లో కూడా ఉంటాయని ప్రూవ్ చేద్దామని అన్నారు. ప్రతి మహిళ కోసం పోరాడుదామని తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూద్దామని అన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News