ఆ సినిమాకే మణిశర్మకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్..

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, థమన్ టాప్ లో ఉన్నారు.

Update: 2024-08-14 04:58 GMT

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, థమన్ టాప్ లో ఉన్నారు. అయితే 12 ఏళ్ళు వెనక్కి వెళ్తే తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పేరు వినిపించేది. మాగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా మణిశర్మ మ్యూజిక్ దర్శకత్వంలోనే వస్తూ ఉండేవి. 1997 నుంచి 2012 వరకు మణిశర్మ హవా కొనసాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మణిశర్మ ను బీట్ చేసేవారు లేరనే మాట వినిపించేది. ఆ తర్వాత మణిశర్మ ప్రభావం తగ్గుతూ వచ్చింది. రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉన్నా ఆయన నుంచి భారీ సక్సెస్ పడలేదు.

1992లో రాత్రి అనే సినిమాతో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. 1997లో వెంకటేష్ తో చేసిన ప్రేమించుకుందాం రా మూవీ, తరువాత ఏడాది మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాలు మణిశర్మని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చేశాయి. అక్కడి నుంచి 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా వరకు మణిశర్మని ఆపేవారే లేరు. ఆ తరువాత నుంచి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా మూవీస్ చేస్తూనే ఉన్న చెప్పుకోదగ్గ స్థాయిలో సాంగ్స్ పడలేదు.

కొన్ని సినిమాలు పాటలు బాగున్న కూడా మూవీస్ డిజాస్టర్ కావడంతో మణిశర్మ ఫేమ్ ఎస్టాబ్లిష్ కాలేదు. అదే సమయంలో కొత్తదనం కోసం ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్స్ పైన కూడా మన టాలీవుడ్ దర్శకులు ఆధారపడటం మొదలైంది. కోలీవుడ్ నుంచి యువన్ శంకర్ రాజా, హరీస్ జైరాజ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో కొంతకాలం ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే దేవిశ్రీప్రసాద్, థమన్ శకం మొదలైన తర్వాత మాగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలను వీరిద్దరే చేస్తూ వస్తున్నారు.

అయితే టాలీవుడ్ లో అందరికంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న వ్యక్తి అంటే మణిశర్మ అని చెప్పాలి. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. మొదటిసారి ఇంద్ర సినిమా కోసం అత్యధికంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు మణిశర్మ తెలిపారు. ఇండియాలోనే మొదటిసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత రెమ్యూనరేషన్ అందుకోవడం జరిగిందని అన్నారు. దీన్ని బట్టి దశాబ్దం క్రితం వరకు మణిశర్మ ప్రభావం టాలీవుడ్ లో ఏ విధంగా ఉండేదో చెప్పొచ్చు.

గత ఏడాది మణిశర్మ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏకంగా 9 సినిమాలు వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి మ్యూజికల్ గా మెప్పించలేదు. శాకుంతలం పాటలు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. చాలా కాలంగా అతను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫామ్ లో లేరు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ కి మరల మణిశర్మ మంచి కమర్షియల్ బీట్స్ ఇచ్చారు. ఈ సాంగ్స్ కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీతో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News