మట్కా పూర్ణా మార్కెట్ వీడియో.. వర్త్ వర్మ అనిపించేలా..!

ఇది వరుణ్ తేజ్ మార్క్ K.G.F అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Update: 2024-10-10 08:26 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో మట్కా అంటూ రాబోతున్నాడు. కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది. టీజర్ లోనే మట్కా కథ చాలా పెద్దది అనిపించేలా చేశాడు కరుణ కుమార్. వరుణ్ తేజ్ ఈమధ్య చేసిన ఏ సినిమాకు రాని రెస్పాన్స్ మట్కా టీజర్ కు వచ్చింది. ఇది వరుణ్ తేజ్ మార్క్ K.G.F అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మట్కా సినిమా 1950 నుంచి 1980 కాలం నాటి కథగా వస్తుంది.

ఐతే సినిమా కోసం పూర్ణా మార్కెట్ సెట్ వేశారు. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ సెట్ వేసినట్టు తెలుస్తుంది. పూర్ణా మార్కెట్ ని యాజిటీజ్ దించేశారనిపించేలా ఈ సెట్ కనిపిస్తుంది. దాదాపు 1500 ల షాపుల దాకా ఏర్పాటు చేశారు. మట్కా సినిమా కోసం ఏర్పాటు చేసిన పూర్ణ మార్కెట్ సెట్ మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ మార్కెట్ సెట్ ఎలా వేశారన్నది చెప్పారు.

పూర్ణా మార్కెట్ సెట్ గురించి డైరెక్టర్ కరుణ కుమార్ చెబుతూ మట్కా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ మార్కెట్ లోనే ఉంటుంది. మట్కా సినిమాలో పూర్ణా మార్కెట్ కు ఒక స్పెషల్ క్యారెక్టర్ అని అన్నారు. మార్కెట్ ని ఒక క్యారెక్టర్ గా చెప్పారంటే అది కథలో ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థం చేసుకోవచ్చు. పూర్ణ మార్కెట్ కోసం వేసిన భారీ సెట్ చూసిన ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మేకింగ్ వీడియోనే ఈ రేంజ్ లో ఉంటే సినిమాలో పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

వైరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మట్కా సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా వెనకపడ్డ వరుణ్ తేజ్ ఒక మంచి మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ కల మట్కా సినిమాతో నెరవేరుతుందని అనిపిస్తుంది. మెగా ప్రిన్స్ మాస్ స్టామినా ప్రూవ్ చేసేలా మట్కా వస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన రేంజ్ లో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. వరుణ్ తేజ్ మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ లాక్ చేశారు. సినిమాపై వరుణ్ తేజ్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు.

Full View
Tags:    

Similar News