మిక్కీ సార్.. ఈ మాస్ అసలు ఊహించలేదు

ఆయన స్వరపరిచిన పాటలు ఎన్నిసార్లు విన్నా.. మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. అస్సలు బోర్ కొట్టవ్

Update: 2024-07-28 03:00 GMT

తెలుగులో నాలుగైదు మెలోడీ సాంగ్స్ వినిపించాయంటే.. అందులో ఒక్కటైనా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన సాంగ్ కచ్చితంగా ఉంటుంది. స్లో మెలోడీ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఆయన.. ఇప్పటికే అద్భుతమైన ఆల్బమ్స్ అందించారు. హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తదితర సినిమాలతో ది బెస్ట్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు.

ఆయన స్వరపరిచిన పాటలు ఎన్నిసార్లు విన్నా.. మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. అస్సలు బోర్ కొట్టవ్. దీంతో మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్ లో మిక్కీ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలానే ఉంటాయి. అయితే ఆయన ఎక్కువగా ఫారిన్ లోనే కంపోజ్ చేస్తుంటారు. మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి జరపరు. దర్శకులు స్టోరీ చెప్పిన వెంటనే రంగంలోకి దిగిపోతారు. ఏదేమైనా తన వర్క్ తో అలరిస్తారు. అయితే మిక్కీ జే మేయర్ లో మంచి మాస్ యాంగిల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.

గద్దలకొండ గణేష్‌, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సహా ఫుల్ మాస్ సినిమాలకు వర్క్ చేశారు. మెలోడీలంటే చాలా ఇష్టమైన ఆయన.. వైరల్ ట్యూన్స్ తో మాస్ సాంగ్స్ ను హిట్ చేసేస్తుంటారు. ప్రస్తుతం అదే చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీకి మిక్కీ వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుని అలరిస్తున్నాయి.

మెయిన్ గా రెప్పల్ డప్పుల్ సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు. మిక్కీ జే మేయర్ సంగీతం ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తూ సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. థియేటర్ల లో ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చే సాంగ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ సాంగ్ కు థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే అని నెటిజన్లు చెబుతున్నారు. వేరే లెవల్ లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుని దూసుకుపోతోంది. గద్దలకొండ గణేష్ లోని జర్రా జర్రా పాట కన్నా ఎక్కువ వైరల్ అవుతోంది.

దీంతో హరీష్ శంకర్.. తన సినిమాకు కావాల్సిన మాస్ మెటీరియల్ ను మిక్కీ నుంచి తీసుకున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫ్యూచర్ లో మాస్ సినిమాలు తీసే డైరెక్టర్లకు బెస్ట్ ఛాయిస్ గా మిక్కీ నిలుస్తారని అంటున్నారు. మాస్ పల్స్ పట్టే టాలెంట్ ఆయనలో ఇంత ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక.. సాంగ్స్ ఎంతటి హిట్ అవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News