2024-మిస్ వ‌ర‌ల్డ్ లో ఆ బ్యూటీ స‌త్తా చాటేనా?

నేడు అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వం. ప్ర‌పంచ‌మంతా మ‌హిళా సాధిక‌ర‌త గురించే మాట్లాడు కుంటుంది

Update: 2024-03-08 06:43 GMT

నేడు అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వం. ప్ర‌పంచ‌మంతా మ‌హిళా సాధిక‌ర‌త గురించే మాట్లాడు కుంటుంది. ప్రపంచంలో మ‌హిళ‌ల స్థానం ఏంటి? అన్ని రంగాల్లో మ‌హిళ‌లు ఎలా ముందుకు సాగుతు న్నారు? గాంధీ క‌న్న క‌ల‌ల భార‌తం ఎంత‌వ‌ర‌కూ సాక‌ర‌మైంది? అంటూ ఒకటే నెట్టింట డిస్క‌ష‌న్ సాగుతుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ సుంద‌రి పోటీల గురించి గుర్తుచేసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.

ఎందుకంటే హీరోయిన్లు అంతా మోడ‌లింగ్ రంగం నుంచే ఎక్కువ మంది సినిమా రంగంలోకి వ‌స్తుంటారు. వాళ్ల‌కున్న అవ‌కాశాలు బ‌య‌ట మ‌హిళ‌ల‌కు ఉండ‌వు. ఓసారి ఆ సంగ‌తుల్లోకి వెళ్తే.. 1951 లో తొలిసారి ఈ పోటీల నిర్వ‌హ‌ణ జ‌రిగింది. బ్రిట‌న్ పెస్టివ‌ల్స్ లో భాగంగా బ్రిటీషె టెలివిజన్ ప్ర‌జెంట‌ర్ ఎరిక్ మోర్లే బికినీ కాంటెస్ట్ ని 1951 లో ప్ర‌వేశ పెట్టారు. దానికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. దీంతో అదే ఈవెంట్ త‌ర్వాత కాలంలో మిస్ వ‌ర‌ల్డ్ గా మారింది.

బికినీ ధ‌రించి ప్ర‌ద‌ర్శ‌నిల్వ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. దీంతో ఇలాగైతే లాభం లేద‌నుకున్న నిర్వ‌హ‌కులు బికినీ స్థానంలో స్విమ్ షూట్ ని తీసుకొచ్చారు. ఈ పోటీల‌ను 1959 నుంచి బిబీసీ ప్ర‌సారం చేయ‌డం ప్రారంభించింది. 60-70వ ద‌శ‌కంలో ఎక్కువ మంది వీక్షించిన షోగా రికార్డు సైతం సాధించింది. మిస్ వ‌ర‌ల్డ్ తొలి కిరీటాన్ని స్వీడ‌న్ కి చెందిన హ‌కాన్స‌న్ ద‌క్కించుకుంది. ఇదే అవార్డు అందుకున్న తొలి న‌ల్ల జాతీయ‌రాలిగా జెన్నిఫ‌ర్ హోస్ట‌న్ రికార్డు సృష్టించింది.

1966 లో తొలిసారి భార‌త్ లో బెంగుళూరు వేదిక‌గా ఈ పోటీలు జ‌రిగాయి. అందులో వెనుజులా సుంద‌రి విజేత‌గా నిలిచింది. అదే ఏడాది నుంచి ఇంట‌ర్నెట్ క‌వ‌రేజీ తీసుకొచ్చింది. మ‌ళ్లీ ఇంత కాలానికి భార‌త్ లో ఈ పోటీలు జ‌ర‌గ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 9న మొద‌లైన పోటీలు మార్చి 9 తో ముగుస్తున్నాయి. ఇది 71వ అందాల పోటీ. భార‌త్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆరుగురు విజేత‌లుగా నిలిచారు. అత్య‌ధికంగా ఆరు కిరీటాలు సాధించిన దేశంగా భార‌త్ కి స్థానం ఉంది. తాజాగా జ‌రుగుతోన్న పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. 2022 మిస్ ఇండియా వ‌ర‌ల్డ్2022 సినిశెట్టి భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తుంది. ఇప్ప‌టికే ప‌లు రౌండ్లలో నెగ్గుకొచ్చింది. మ‌రి 2024 లో విజేత‌గా నిల‌వాల‌ని ఆశిద్దాం.

Tags:    

Similar News